తెలంగాణను చుట్టేస్తున్నషర్మిల
పరామర్శలనే నమ్ముకున్న వైఎస్ఆర్‌సీపీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్రల పేరుతో తెలంగాణను చుట్టేస్తున్నారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన కుటుంబాలను పరామర్శిస్తాని జగన్ ఇచ్చిన మాటను షర్మిల నెరవేరుస్తున్నారు. గతంలో ఖమ్మం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర చేశారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్ యాత్రకు జగన్ సిద్ధమైనా తెలంగాణవాదుల దాడి కారణంగా బ్రేక్‌పడింది. ఇక తెలంగాణలో జగన్ పర్యటించే అవకాశాలు కనిపించకపోవడంతో ఆ బాధ్యతను షర్మిల తీసుకున్నారు. […]
BY sarvi24 Jun 2015 5:40 AM IST
X
sarvi Updated On: 24 Jun 2015 10:43 AM IST
పరామర్శలనే నమ్ముకున్న వైఎస్ఆర్‌సీపీ
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్రల పేరుతో తెలంగాణను చుట్టేస్తున్నారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన కుటుంబాలను పరామర్శిస్తాని జగన్ ఇచ్చిన మాటను షర్మిల నెరవేరుస్తున్నారు. గతంలో ఖమ్మం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర చేశారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్ యాత్రకు జగన్ సిద్ధమైనా తెలంగాణవాదుల దాడి కారణంగా బ్రేక్‌పడింది. ఇక తెలంగాణలో జగన్ పర్యటించే అవకాశాలు కనిపించకపోవడంతో ఆ బాధ్యతను షర్మిల తీసుకున్నారు. రాష్ర్ట విభజన అనంతరం జగన్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యారు. తెలంగాణ అద్యక్షుడిగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పొంగులేటి నాయకత్వంలో పార్టీ విభాగం అడపాదడపా కొన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రధానంగా షర్మిల పరామర్శ యాత్ర పార్టీకి బాగా తోడ్పడుతుందని వైఎస్ ఆర్‌సీపీ నాయకులు భావిస్తున్నారు. షర్మిల ఇప్పటికే మహబూబ్ నగర్, నల్గగొండ జిల్లాల్లో పరామర్శ యాత్ర పూర్తి చేశారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్ర చేపట్టారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2 దాకా అంటే నాలుగు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ యాత్రలో భాగంగా 7 నియోజక వర్గాల్లో పర్యటించి, 15 కుటుంబాల్ని పరామర్శిస్తారు. జూన్ 29న మహేశ్వరం నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని, ఆ తర్వాత ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పర్యటిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ చెప్పారు. షర్మిల వెంట పరామర్శయాత్రలో పార్టీ తెలంగాణ విభాగ రాష్ర్ట అధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి, ఇతర రాష్ర్ట, జిల్లా స్థాయి నాయకులు ఉంటారన్నారు. ఈరెండు నియోజకవర్గాలలో మూడు కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. ఏడు నియోజకవర్గాలలో మొత్తం 660 కిలోమీటర్లు షర్మిల పర్యటిస్తారని, 15 కుటుంబాలను పరామర్శిస్తారని శివకుమార్ వివరించారు. ఇబ్రహీంపట్నం తర్వాత యాత్ర మేడ్చల్ నియోజకవర్గంలో సాగుతుందని, జూన్ 30న ఐదుగ్రామాలలో పర్యటించిన అనంతరం మర్నాడు చేవెళ్ల, పరిగి, తాండూర్ నియోజకవర్గాలలో ఉంటుందని చెప్పారు. జులై 2న వికారాబాద్ నియోజకవర్గంతో పర్యటన ముగుస్తుందని, ఈ నియోజక వర్గంలో మూడు గ్రామాలలో షర్మిల పర్యటిస్తారని శివకుమార్ వివరించారు.
Next Story