Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 123

ఒకరంటే ఒకరికి పడని ఇద్దరు రచయితలు కలుసుకున్నారు. మొదటి రచయిత “నీ పుస్తకం చదివాను. అది చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎవరి దగ్గర రాయించావు?” అన్నాడు. రెండో రచయిత “నీ మాటలు విని చాలా సంతోషం కలిగింది. ఇంతకూ నీకోసం ఆ పుస్తకాన్ని ఎవరు చదివిపెట్టారు?” అన్నాడు. —————————————————————— డిప్లొమాట్‌: రెండుసార్లు సీరియస్‌గా ఆలోచించి చివరకు ఏమీ చెప్పనివాడు రాజకీయవేత్త: ఎలక్షన్లముందు తరువాత కూడా నీకు “చెయ్యిచ్చే”వాడు భర్త: బయటికి అధికారి, లోపల సేవకుడు టెలివిజన్‌: తలనొప్పి […]

ఒకరంటే ఒకరికి పడని ఇద్దరు రచయితలు కలుసుకున్నారు.
మొదటి రచయిత “నీ పుస్తకం చదివాను. అది చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎవరి దగ్గర రాయించావు?” అన్నాడు.
రెండో రచయిత “నీ మాటలు విని చాలా సంతోషం కలిగింది. ఇంతకూ నీకోసం ఆ పుస్తకాన్ని ఎవరు చదివిపెట్టారు?” అన్నాడు.
——————————————————————
డిప్లొమాట్‌: రెండుసార్లు సీరియస్‌గా ఆలోచించి చివరకు ఏమీ చెప్పనివాడు

రాజకీయవేత్త: ఎలక్షన్లముందు తరువాత కూడా నీకు “చెయ్యిచ్చే”వాడు
భర్త: బయటికి అధికారి, లోపల సేవకుడు
టెలివిజన్‌: తలనొప్పి తెప్పించి అమృతాంజనం ప్రకటన ఇచ్చేది.
ఫ్రెండ్‌షిప్‌: వర్షానికి ముందు గొడుగు అప్పిచ్చి వర్షమొచ్చాక తీసుకునేది
ఎకనామిస్టు: ఇతరుల దగ్గర వున్న డబ్బు గురించి ఆలోచించేవాడు.
——————————————————————
బస్‌స్టాప్‌లో ఒకమ్మాయి ఉంటే ఒక అబ్బాయి ఆ అమ్మాయి వెనక నిల్చున్నాడు. చుట్టూ ఎవరూ లేంది చూసి “ఎక్కడో మిమ్మల్ని చూసినట్లుంది” అన్నాడు.

ఆ అమ్మాయి “మెంటల్‌ హాస్సిటల్లో నర్సుని” అంది.
——————————————————————
కొంతమంది స్త్రీలు వాళ్ళ కాలనీలో మద్యపాన నిషేధ ప్రచారానికి బయల్దేరారు. ఆరోజు సాయంత్రం ఒక ఆర్మీ ఆఫీసర్‌ ఇంటికెళ్ళారు.
ఆయన రిటైరయ్యారు,
ఆఫీసర్‌ స్త్రీలని ఆహ్వానించాడు.
ఒక స్త్రీ “చివరిసారిగా మీరు ఎప్పుడు తాగారు?” అని అడిగింది.
“1945”లొ అన్నాడు ఆర్మీ ఆఫీసర్‌.
“వెరీగుడ్‌. ఐతే మీరిప్పుడు తాగటం లేదన్నమాట” అంది.
ఆఫీసర్‌ వాచీ చూసుకుని ఇప్పుడు 20.15 ఐంది. తీసుకుని ఇంకా గంట కూడా గడవలేదు. ఇప్పుడే తీసుకోను” అన్నాడు.

First Published:  23 Jun 2015 6:33 PM IST
Next Story