రేవంత్ బెయిల్‌పై విచారణ 26కు వాయిదా
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి మళ్ళీ నిరాశే ఎదురయ్యింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసులో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి, 20 రోజుల నుంచి జైలులోనే ఉన్నారు. తాజాగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరగ్గా, అదనపు కౌంటర్ దాఖలకు ఏసీబీ న్యాయవాది సమయం కోరారు. వారం రోజుల సమయాన్ని ఏసీబీ తరఫు న్యాయవాది కోరగా, రెండు రోజుల సమయం మాత్రమే కోర్టు ఇచ్చింది. […]
BY Pragnadhar Reddy23 Jun 2015 6:55 PM IST
Pragnadhar Reddy Updated On: 24 Jun 2015 3:52 PM IST
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి మళ్ళీ నిరాశే ఎదురయ్యింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసులో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి, 20 రోజుల నుంచి జైలులోనే ఉన్నారు. తాజాగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరగ్గా, అదనపు కౌంటర్ దాఖలకు ఏసీబీ న్యాయవాది సమయం కోరారు. వారం రోజుల సమయాన్ని ఏసీబీ తరఫు న్యాయవాది కోరగా, రెండు రోజుల సమయం మాత్రమే కోర్టు ఇచ్చింది. దాంతో కేసు విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. రేవంత్‌రెడ్డి అనుచరులు దీంతో నిరాశకు గురయ్యారు. మరోపక్క పోరెన్సికల్ ల్యాబ్ ఆడియో, వీడియో టేపులపై ఏసీబీకి నివేదిక సమర్పించడంతో శుక్రవారమైనా బెయిలు వస్తుందా… లేక బెయిల్ రాకుండా ఏసీబీ అధికారులు మరోసారి ప్రయత్నిస్తారా అన్నది ఇపుడు చర్చనీయాంశమైంది.
Next Story