అనాథలకు రెసిడెన్షియల్ కాలేజ్
అనాథ పిల్లల కోసం మొట్ట మొదటిసారిగా రెసిడెన్షియల్ కాలేజ్ ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అనాథ పిల్లలకు పదో తరగతి తర్వాత ఉచిత విద్య అందించడం కోసం మొట్ట మొదటి గురుకుల కళాశాలను ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కళాశాల శంకుస్ధాపనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించామని సీఎం తెలిపారు. అనాథలకు విద్యావసతులు అనే అంశంపై అధికారులతో ఆయన మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తల్లిదండ్రులు లేని అనాథ […]
అనాథ పిల్లల కోసం మొట్ట మొదటిసారిగా రెసిడెన్షియల్ కాలేజ్ ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అనాథ పిల్లలకు పదో తరగతి తర్వాత ఉచిత విద్య అందించడం కోసం మొట్ట మొదటి గురుకుల కళాశాలను ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కళాశాల శంకుస్ధాపనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించామని సీఎం తెలిపారు. అనాథలకు విద్యావసతులు అనే అంశంపై అధికారులతో ఆయన మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ప్రభుత్వమే అండగా ఉండాలన్నది తమ ఆకాంక్ష అని, ఇటీవల గణితంలో అద్భుత ప్రతిభ కనపరిచిన ఇద్దరు బాలికలు పదో తరగతి తర్వాత ఏం చేయాలో తెలియట్లేదని చెప్పారని, దీనిని దృష్టిలో పెట్టుకునే రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం అధికారులకు వివరించారు. అనాథ పిల్లల కోసం పదో తరగతి వరకే వసతి గృహాలున్నాయని, ఆ తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు వారికి చేయూతనిస్తున్నా సరిపోవడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే ప్రభుత్వం వారి అభివృద్ధి, సంక్షేమం కోసం పలు ప్రత్యేక చర్యలు తీసుకోనుందని ముఖ్యమంత్రి చెప్పారు.