బతికున్నంత వరకు 'దేశం' లోనే ఉంటా: మోత్కుపల్లి
తనకు చావైనా, బతుకైనా తెలుగుదేశం పార్టీతోనేనని, పార్టీ మారే ఆలోచన కలలో కూడా రాదని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నానని, వరంగల్ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారం రాజకీయ కుట్రలో భాగమని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీ టీడీపీ నాయకులతో మైండ్ గేమ్ ఆడుతోందని, అదొక దొంగల పార్టీ అని నర్సింహులు ఆరోపించారు. ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖరరావు వాడుతున్న భాష విని […]
BY sarvi23 Jun 2015 6:45 PM IST
sarvi Updated On: 24 Jun 2015 10:46 AM IST
తనకు చావైనా, బతుకైనా తెలుగుదేశం పార్టీతోనేనని, పార్టీ మారే ఆలోచన కలలో కూడా రాదని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నానని, వరంగల్ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారం రాజకీయ కుట్రలో భాగమని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీ టీడీపీ నాయకులతో మైండ్ గేమ్ ఆడుతోందని, అదొక దొంగల పార్టీ అని నర్సింహులు ఆరోపించారు. ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖరరావు వాడుతున్న భాష విని తెలంగాణలోనే సిగ్గు పడుతున్నారని, సీఎంగా హూందాతనం ప్రదర్శించాలని ఆయన కోరారు. మామూలు మనిషి కన్నా హీనంగా మాట్లాడి పరువు పోగొట్టుకోవద్దని హితవు పలికారు.
ఉమ్మడి రాజధాని విషయంలో కేసీఆర్ ఎందుకు ఆనాడు అంగీకరించారని మోత్కుపల్లి ప్రశ్నించారు. తనకున్న చేతగానితనం, బుద్ది తక్కువ తనం, అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికి ఆంద్రావాళ్ళని తిడితే తెలంగాణ వాళ్ళు మెచ్చుకుంటారనుకోవడం అవివేకమని ఆయన అన్నారు. సెక్షన్ 8 అమలు చేస్తే నీకొచ్చే నష్టమేమిటని ఆయన ప్రశ్నించారు.
Next Story