పరిశ్రమలకు గడువుకు ముందే అనుమతులు..కేసీఆర్
పరిశ్రమకు సంబంధించిన పక్కా సమాచారంతో దరఖాస్తులను సమర్పిస్తే నిర్ణీత గడువు కంటే ముందే అనుమతులు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అనుమతుల మంజూరులో ప్రభుత్వం చూపుతున్న వేగాన్ని పారిశ్రామికవేత్తలు అందుకోవాలని, సాధ్యమైనంత త్వరగా పరిశ్రమలను ప్రారంభించాలని ఆయన సూచించారు. మంగళవారం సచివాలయంలో ఆయన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుమతులు, స్వీయధృవీకరణ విధానం (టీఎస్ఐపాస్) కింద 17 కొత్త పరిశ్రమలకు అనుమతుల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెట్టుబడులకు తెలంగాణను స్వర్గధామంగా మార్చేలా […]
పరిశ్రమకు సంబంధించిన పక్కా సమాచారంతో దరఖాస్తులను సమర్పిస్తే నిర్ణీత గడువు కంటే ముందే అనుమతులు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అనుమతుల మంజూరులో ప్రభుత్వం చూపుతున్న వేగాన్ని పారిశ్రామికవేత్తలు అందుకోవాలని, సాధ్యమైనంత త్వరగా పరిశ్రమలను ప్రారంభించాలని ఆయన సూచించారు. మంగళవారం సచివాలయంలో ఆయన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుమతులు, స్వీయధృవీకరణ విధానం (టీఎస్ఐపాస్) కింద 17 కొత్త పరిశ్రమలకు అనుమతుల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెట్టుబడులకు తెలంగాణను స్వర్గధామంగా మార్చేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని చేపట్టామని అన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు పది రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని ఆయన అన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇస్తోందని, దీనిని పారిశ్రామికవేత్తలు వినియోగించుకొని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం అన్నారు.