తెలంగాణ రైతాంగానికి పగలే వెన్నెల
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పగలే వెన్నెల కురిపించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఖరీప్ నుంచి వ్యవసాయ రంగానికి పగలే 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అందుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ రంగానికి సరఫరా చేస్తున్న విద్యుత్ పై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో అది కూడా రెండు మూడు విడతలుగా విద్యుత్ సరఫరా చేయడం వల్ల […]
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పగలే వెన్నెల కురిపించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఖరీప్ నుంచి వ్యవసాయ రంగానికి పగలే 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అందుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ రంగానికి సరఫరా చేస్తున్న విద్యుత్ పై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో అది కూడా రెండు మూడు విడతలుగా విద్యుత్ సరఫరా చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. దీనిపై ఆయన జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్‌పీడీసీఎల్ అధికారులతో మంగళవారం సచివాలయంలో సమావేశమయ్యారు. వ్యవసాయ పంపు సెట్లన్నింటికీ 9 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమయ్యే విద్యుత్‌ను శాస్త్రీయ పద్ధతుల్లో అంచనా వేయాలని సూచించారు. దీనికి స్పందించిన అధికారులు వ్యవసాయ ఫీడర్లను రెండు విభాగాలుగా విభజించి ఒక భాగం ఫీడర్లకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, మరో భాగం ఫీడర్లకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకూ సరఫరా చేస్తామని సీఎంకు తెలిపారు.