రామ్ గోపాల్ వర్మ ఏం నేర్పించడు..!
రామ్ గోపాల్ వర్మ. ఒక క్రియేటివ్ జీనియస్. ఇండియన్ సినిమాకు హాలీవుడ్ పోకడ నేర్పిన టెక్నికల్ జీనియస్. మూస పద్దతిని బ్రేక్ చేసి.. కొత్త ఒరవడి నేర్పించాడు. శివ చిత్రం తో టాలీవుడ్ లో సంచలనం చేసి.. ఇక్కడ నుంచి తన ప్రతిభకు బాలీవుడే సరైన ప్లేస్ అని భావించి అక్కడకు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ కూడా రంగీల, సత్య, సర్కార్, కంపేని, భూత్, రణ్ వంటి చిత్రాలతో తన సత్తా చాటాడు. కట్ చేస్తే వర్మ […]
రామ్ గోపాల్ వర్మ. ఒక క్రియేటివ్ జీనియస్. ఇండియన్ సినిమాకు హాలీవుడ్ పోకడ నేర్పిన టెక్నికల్ జీనియస్. మూస పద్దతిని బ్రేక్ చేసి.. కొత్త ఒరవడి నేర్పించాడు. శివ చిత్రం తో టాలీవుడ్ లో సంచలనం చేసి.. ఇక్కడ నుంచి తన ప్రతిభకు బాలీవుడే సరైన ప్లేస్ అని భావించి అక్కడకు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ కూడా రంగీల, సత్య, సర్కార్, కంపేని, భూత్, రణ్ వంటి చిత్రాలతో తన సత్తా చాటాడు. కట్ చేస్తే వర్మ శిష్యగణం దేశ వ్యాప్తంగా వున్నారంటే అతిశయోక్తి కాదు . వర్మ బెసికల్ గా తెలుగు ఆయన కాబట్టి.. మన తెలుగు దర్శకుల్లో చాలమంది ఆయన శిష్యులున్నారు. కృష్ణవంశీ, జేడి, పూరీ జగన్నాధ్ , హరీష్ శంకర్, ఇలా చాల మంది వున్నారు. తాజాగా జాదుగాడు సినిమాతో అభిమానుల్ని మెప్పించి ..తన ఉనికిని చాటుకోవడానికి సిద్దమైన దర్శకుడు యోగేష్ కూడా వర్మ శిష్యుడే.
జాదుగాడు సినిమా విడుదల సందర్బంగా ప్రెస్ మీట్ లో పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు దర్శకుడు యోగి. ఒక రాజు .. ఒక రాణి చిత్రంతో దర్శకుడిగా మారిన యోగి.. ఏడు సంంత్సరాల క్రితం చింతకాయల రవి తో మెప్పించాడు. ఆ చిత్రం తరువాత తాజాగా యువ హీరో నాగశౌర్య లీడ్ రోల్ లో జాదుగాడు పేరు తో యాక్షన్ ఎలిమెంట్స్ వున్న చిత్రం చేశారు. ఈ సందర్భంగా దర్శకత్వానికి సంబంధింది వర్మ ఏం నేర్పించారని మీడియా వారు అడిగారు. దీనికి యోగి .. ఆయన ఏం నేర్పించలేదు. నాకే కాదు.. తన దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేసే వారికి ఏం నేర్పించడు. అయితే ఆయన ప్రభావం మాత్రం ఆయన శిష్యులందరి మీద చాల ఎక్కువుగా వుంటుందన్నారు. తన మీద కూడ వర్మ ప్రభావం చాల వున్నట్లు చెప్పుకున్నారు. సరే ఇది ఇలా వుంచిదే.. 13 సంవత్సరాల కెరీర్ లో రెండు చిత్రాలే చేసిన యోగి.. కనీసం జాదుగాడు చిత్రంతో అయిన ఒక బిగ్ హిట్ కొడతాడేమో లెట్స్ వెయిట్ అండ్ సీ.