సెక్షన్-8కు అనుమతించ లేదు: కేంద్రం
హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు చేయమని గవర్నర్‌కు తామెలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్రహోంశాఖ స్పష్టం చేసింది. ఒకవేళ ఉమ్మడిరాజధానిలో ఏపీ ఠాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే..గవర్నర్ చూస్తూ ఊరుకోరని కుండబద్దలు కొట్టింది. తెలంగాణ భూభాగంలో ఏపీ పోలీసులకు ఎలాంటి అధికారాలు ఉండవని పేర్కొంది. దీంతో హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కొన్ని మీడియా సంస్థల్లో జరిగిందంతా ఉత్తుత్తి ప్రచారమని తేటతెల్లమైంది. సెక్షన్-8 ఉన్నది చట్ట విరుద్ధమైన చర్యలకు, అసాంఘిక కార్యకలాపాలకు భద్రత కల్పించేందుకు కాదని […]
BY Pragnadhar Reddy24 Jun 2015 2:43 AM IST
X
Pragnadhar Reddy Updated On: 24 Jun 2015 2:43 AM IST
హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు చేయమని గవర్నర్‌కు తామెలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్రహోంశాఖ స్పష్టం చేసింది. ఒకవేళ ఉమ్మడిరాజధానిలో ఏపీ ఠాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే..గవర్నర్ చూస్తూ ఊరుకోరని కుండబద్దలు కొట్టింది. తెలంగాణ భూభాగంలో ఏపీ పోలీసులకు ఎలాంటి అధికారాలు ఉండవని పేర్కొంది. దీంతో హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కొన్ని మీడియా సంస్థల్లో జరిగిందంతా ఉత్తుత్తి ప్రచారమని తేటతెల్లమైంది. సెక్షన్-8 ఉన్నది చట్ట విరుద్ధమైన చర్యలకు, అసాంఘిక కార్యకలాపాలకు భద్రత కల్పించేందుకు కాదని స్పష్టంచేసింది. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు సంతృప్తికరంగానే ఉన్నాయని పేర్కొంది. నగరంలో ఏపీ పోలీసులు ఠాణాలు ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న హోంశాఖ.. అసలు అక్కడ ఏపీ పోలీసులకు జ్యూరిస్‌డిక్షన్ ఏమీ ఉండదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో తామ స్పష్టతతో ఉన్నామని, గందరగోళమంతా ఇక్కడి మీడియాలోనే ఉందని ఎద్దేవాచేసింది.
Next Story