సెక్షన్ 8పై 'రౌండ్ టేబుల్' రసాభాస
సెక్షన్ 8పై విశాఖపట్నంలో బుధవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం రసాభాసగా మారింది. హైకోర్టులో తమపై దాడి చేస్తున్నప్పుడు గుర్తు రాని ఈ సెక్షన్ ఇపుడెందుకు గుర్తుకొచ్చిందని న్యాయవాదులు నిలదీశారు. అధికారులు, న్యాయవాదుల మధ్య దసపల్లా హోటల్‌లో ఈ సమావేశం జరిగింది. రేవంత్‌రెడ్డి కేసులో ఇరుక్కున్నందున ఈ సెక్షన్ గుర్తుకు వచ్చిందా అని వారు ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదులపైన, న్యాయ మూర్తులపైన దాడి జరిగినప్పుడు ఈ సెక్షన్ ఎందుకు గుర్తుకు రాలేదని వారు నిలదీశారు. […]
BY sarvi24 Jun 2015 8:23 AM IST
X
sarvi Updated On: 24 Jun 2015 10:18 AM IST
సెక్షన్ 8పై విశాఖపట్నంలో బుధవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం రసాభాసగా మారింది. హైకోర్టులో తమపై దాడి చేస్తున్నప్పుడు గుర్తు రాని ఈ సెక్షన్ ఇపుడెందుకు గుర్తుకొచ్చిందని న్యాయవాదులు నిలదీశారు. అధికారులు, న్యాయవాదుల మధ్య దసపల్లా హోటల్‌లో ఈ సమావేశం జరిగింది. రేవంత్‌రెడ్డి కేసులో ఇరుక్కున్నందున ఈ సెక్షన్ గుర్తుకు వచ్చిందా అని వారు ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదులపైన, న్యాయ మూర్తులపైన దాడి జరిగినప్పుడు ఈ సెక్షన్ ఎందుకు గుర్తుకు రాలేదని వారు నిలదీశారు. ఇపుడు ఈ చర్చలో పాల్గొన్నవారంతా ఆరోజు హైదరాబాద్‌లోనే ఉన్నారు కదా… మరి తమ బాధ్యత వారికి లేదా… తాము బాధితుల్లా కనిపించలేదా అని ప్రశ్నించారు. అసలు హైదరాబాద్‌లో సెక్షన్ 8 పెట్టాల్సి ఉంటే విశాఖలో చర్చకెందుకు వచ్చారని కూడా వారన్నారు. ప్రస్తుతం ఇక్కడ చర్చలో పాల్గొంటున్న వారంతా ఆనాడు సమైక్య ఉద్యమంలో తప్పుకున్నారని, తామే చివరి వరకు పోరాడామని వారన్నారు. 200 రోజులపాటు కోర్టుల్లో విధులకు హాజరుకాకుండా, తమ శక్తిమేర ఉద్యమాన్ని నిలబెట్టామని, కాని హైదరాబాద్‌లో తమ న్యాయవాదులపై దాడులు జరుగుతుంటే తెలుగుదేశం నాయకులెవరూ పట్టనట్టు వ్యవహరించారని, సమస్య తమది కాదన్నట్టుగా వ్యవహరించారని వారు ఆరోపించారు. ఈ సమావేశం ఆంద్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో ఉద్యోగుల ప్రతినిధిగా ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు అశోక్‌బాబు పాల్గొన్నారు.
సెక్షన్ 8 అమలు తప్పనిసరి: రావెల
హైదరాబాద్‌లో ఆంధ్రుల హక్కులకు భంగం కలగకుండా ఉండాలంటే సెక్షన్ 8 అమలు తప్పనిసరని మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. విశాఖలో జర్నలిస్టులు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పాలనను మరో తొమ్మిదేళ్ళపాటు హైదరాబాద్ నుంచే పరిపాలించుకునే అవకాశం తమకు ఉందని, ఈ సమయంలో అందరూ మానసిక ప్రశాంతతతో ఉండాలన్నా, ఆరోగ్యకరమైన వాతావరణంలో పని చేయాలనుకున్నా, తమ హక్కులకు రక్షణ కావాలని కోరుకున్నా సెక్షన్ 8 అమలు అవసరమని ఆయన అన్నారు. ప్రజలకు అవసరమైన రక్షణలు ఒక్క సెక్షన్ 8తోనే రావని, మరిన్ని రక్షణలు అవసరమని, ఇవి ఇప్పుడు పెట్టమని తాము కోరడం లేదని, రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న సెక్షన్ల అమలును మాత్రమే కోరుతున్నామని మంత్రి తెలిపారు. ఎపీ ఎన్జీవో కార్యాలయంపై పలుసార్లు తెలంగాణ ఉద్యోగులు దాడులు చేశారని, సెక్షన్ 8 కోసం తమ ఉద్యమం కేంద్రాన్ని కదిలించేలా ఉంటుందని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. భార్యాభర్తలు కలిసి ఒక్కచోట పని చేయడానికి కూడా తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఒప్పుకోవడం లేదని ఆయన అన్నారు. అన్ని శాఖల ఉద్యోగుల్ని మానసికంగా వేధిస్తున్నారని ఆయన అన్నారు. సెక్షన్ 8 మాత్రమే కాదని, తమకు ఇంకా అనేక రక్షణలు కావాల్సి ఉందని ఉద్యోగ సంఘాల మరోనేత మురళీకృష్ణ అన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదని ఇతర తెలంగాణ జిల్లాల్లో కూడా ఆంధ్రులకు రక్షణ అవసరమని ఆయన అన్నారు.
Next Story