Telugu Global
Others

తెలుగు రాష్ట్రాల్లో ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రాలు 5

తెలుగు రాష్ట్రాల్లోని 5 న‌గ‌రాల‌ను ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రాలుగా తీర్చి దిద్దాల‌ని మోడీ ప్ర‌భుత్వం  సంక‌ల్పించింది. దేశ‌వ్యాప్తంగా  వంద ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రాల‌ను తీర్చిదిద్దాల‌న్న ఆలోచ‌న‌కు మోడీ స‌ర్కార్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే తెలంగాణ‌లో రెండు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు న‌గ‌రాల‌ను ఎంపిక చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టికే వైజాగ్‌ను స్మార్ట్ సిటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన కేంద్రం మ‌రో రెండు న‌గ‌రాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ సిఫారుసు మేర‌కు ఎంపిక చేయ‌నుంది. కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించనున్న ఆక‌ర్ష‌ణీయ‌మైన వంద న‌గ‌రాల ప‌థ‌కంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు  […]

తెలుగు రాష్ట్రాల్లోని 5 న‌గ‌రాల‌ను ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రాలుగా తీర్చి దిద్దాల‌ని మోడీ ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. దేశ‌వ్యాప్తంగా వంద ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రాల‌ను తీర్చిదిద్దాల‌న్న ఆలోచ‌న‌కు మోడీ స‌ర్కార్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే తెలంగాణ‌లో రెండు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు న‌గ‌రాల‌ను ఎంపిక చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టికే వైజాగ్‌ను స్మార్ట్ సిటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన కేంద్రం మ‌రో రెండు న‌గ‌రాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ సిఫారుసు మేర‌కు ఎంపిక చేయ‌నుంది. కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించనున్న ఆక‌ర్ష‌ణీయ‌మైన వంద న‌గ‌రాల ప‌థ‌కంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు దేశంలోనే అత్య‌ధిక వాటా ద‌క్కింది. యూపీలో ప‌ద‌మూడు న‌గ‌రాల‌ను ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఆ త‌ర్వాత స్థానంలో త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్రలున్నాయి. దేశ‌వ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని న‌గ‌రాల‌ను స్మార్ట్ సిటీలుగా మార్చాల‌ని కేంద్రం భావిస్తోంది. అంతేకాకుండా అట‌ల్ ప‌ట్ట‌ణ రూపాంతరీక‌ర‌ణ పున‌రుజ్జీవ‌న ప‌థ‌కం (అమృత్)లో భాగంగా మ‌రెన్నో న‌గ‌రాల‌ను అభివృద్ధి చేయ‌నుంది. అమృత్ ప‌థ‌కం కింద ఏపీ నుంచి 31, తెలంగాణ నుంచి 15 న‌గ‌రాల‌ను అభివృద్ధి చేస్తారు.
తెలంగాణ‌లో అమృత్ ప‌థ‌కానికి ఎంపికైన న‌గ‌రాలు
తెలంగాణ నుంచి అమృత్ ప‌థ‌కానికి 15 న‌గ‌రాలు ఎంపిక‌య్యాయి. అవి హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, రామ‌గుండం, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, మంచిర్యాల‌, న‌ల్గొండ‌, ఆదిలాబాద్‌, కొత్త‌గూడెం, సిద్దిపేట‌, సూర్యాపేట‌, మిర్యాల‌గూడెం, జ‌గిత్యాల‌లున్నాయి.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ….
కేంద్ర ఏపీలో 31 పట్టణాల‌ను అమృత్ ప‌థ‌కం ద్వారా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసింది. అవి గ్రేట‌ర్ విశాఖ మున్సిప‌ల్ కార్పోరేష‌న్, శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విజ‌య‌వాడ, గుడివాడ, మ‌చిలీప‌ట్నం, రాజ‌మండ్రి, కాకినాడ‌, ఏలూరు, భీమ‌వ‌రం, తాడేప‌ల్లిగూడెం, అనంత‌పురం, హిందూపురం, ధ‌ర్మ‌వ‌రం, తాడిప‌త్రి, గుంత‌క‌ల్, క‌డ‌ప, ప్రొద్దుటూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, క‌ర్నూలు, ఆదోని, నంద్యాల, తిరుప‌తి, మ‌ద‌న‌ప‌ల్లి, చిత్తూరు, గుంటూరు, న‌ర్స‌రావుపేట, తెనాలి, చిల‌క‌లూరిపేట పట్టణాలున్నాయి.

First Published:  23 Jun 2015 6:34 PM IST
Next Story