పోలీసులకు నో వీక్లీ ఆఫ్: డీజీపీ
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల సంఖ్య తక్కువగా ఉంది. సిబ్బంది సంఖ్య ను పెంచేవరకూ వారికి వీక్లీ ఆఫ్ ఇవ్వడం కుదరదని డీజీపీ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. తెలంగాణవ్యాప్తంగా మొత్తం 18 వేల పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. సిబ్బంది సంఖ్య పెరిగే వరకూ వారానికో మారు సెలవు ఇవ్వడం కుదరదని డీజీపీ వెల్లడించారు. రాష్ట్ర విభజన చట్టం లోని సెక్షన్ 8 గురించి మాట్లాడుతూ, హైదరాబాద్ […]
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల సంఖ్య తక్కువగా ఉంది. సిబ్బంది సంఖ్య ను పెంచేవరకూ వారికి వీక్లీ ఆఫ్ ఇవ్వడం కుదరదని డీజీపీ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. తెలంగాణవ్యాప్తంగా మొత్తం 18 వేల పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. సిబ్బంది సంఖ్య పెరిగే వరకూ వారానికో మారు సెలవు ఇవ్వడం కుదరదని డీజీపీ వెల్లడించారు. రాష్ట్ర విభజన చట్టం లోని సెక్షన్ 8 గురించి మాట్లాడుతూ, హైదరాబాద్ ముమ్మాటికీ తెలంగాణదేనని, అది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని ఆయన అన్నారు. ఏపీ, తెలంగాణల్లో హాట్ టాపిక్‌గా మారిన ఓటుకు నోటు వ్యవహారం అవినీతి నిరోధక శాఖ పరిధిలోనిదని ఆయన చెప్పారు.