Telugu Global
NEWS

ట్యాపింగ్‌పై స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ను విచారించిన 'సిట్‌'

ఫోన్ల ట్యాపింగ్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్) స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ను ప్ర‌శ్న‌ల వ‌ర్షంతో ముంచెత్తింది. రెండు రోజుల క్రితం విజ‌య‌వాడ భ‌వానీ పురం పోలీస్ స్టేష‌న్‌కు హాజ‌రుకావాల్సిందిగా 9 స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు నోటీసులు జారీ చేయ‌డంతో యూనినార్‌, వొడాఫోన్‌, డొకొమో, రిలయన్స్‌, ఐడియా కంపెనీల ప్రతినిధులు సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు వ‌చ్చారు. 11.30 గంటలకు సిట్‌ అధికారులు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్‌, కాకినాడ ఏఎస్పీ దామోదర్‌, ఏఎస్పీ నరసింహారావు, బెజవాడ […]

ట్యాపింగ్‌పై స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ను విచారించిన సిట్‌
X

ఫోన్ల ట్యాపింగ్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్) స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ను ప్ర‌శ్న‌ల వ‌ర్షంతో ముంచెత్తింది. రెండు రోజుల క్రితం విజ‌య‌వాడ భ‌వానీ పురం పోలీస్ స్టేష‌న్‌కు హాజ‌రుకావాల్సిందిగా 9 స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు నోటీసులు జారీ చేయ‌డంతో యూనినార్‌, వొడాఫోన్‌, డొకొమో, రిలయన్స్‌, ఐడియా కంపెనీల ప్రతినిధులు సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు వ‌చ్చారు. 11.30 గంటలకు సిట్‌ అధికారులు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్‌, కాకినాడ ఏఎస్పీ దామోదర్‌, ఏఎస్పీ నరసింహారావు, బెజవాడ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సీఐ కాశీ విశ్వనాథ్‌ అక్కడికి చేరుకున్నారు. ఉదయం 11.30 గంటలకు మొదలైన విచారణ ప్రక్రియ రాత్రి 10.30 గంటలదాకా సాగింది. ‘అనుమతులు లేకుండానే ఫోన్ల ట్యాపింగ్‌ జరిగిందని త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, మీరు విచారణకు పూర్తిగా సహకరించాల‌ని అధికారులు వారిని కోరారు. ‘ఏపీకి చెందిన ముఖ్యుల ఫోన్లను ట్యాప్‌ చేయాల్సిన అవసరం అస‌లు ఎందుకు వచ్చింది? ఎవరి ఆదేశాల మేరకు ఇలా చేశారు? ట్యాపింగ్‌ చేయాలని ఎవరైనా ఆదేశించి ఉంటే అది నోటి మాట ద్వారా జ‌రిగిందా లేక లిఖిత పూర్వ‌కంగా కోరారా అని ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది. ఫోన్లను ఎప్పటి నుంచి ట్యాప్‌ చేస్తున్నారు? ఎవ‌రెవ‌రి ఫోన్ల‌ను ట్యాప్ చేశారు? డేటాను ఎవరికి అందజేశారు? ప్రొవైడర్ల వద్ద ఎంత డేటా ఉందనే వివరాలపైనా ప్రశ్నించినట్లు తెలిసింది. ట్యాపింగ్‌ చేసిన కాల్స్‌ డేటా మొత్తం తమకు అందజేయాలని సిట్ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆయా కాల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని డిలిట్‌ చేయకుండా భద్రపరచాలని కోరారు. కొందరు సర్వీస్‌ ప్రొవైడర్లు కాల్‌డేటాను కొంతమేరకు సిట్‌ అధికారులకు సమర్పించారని… ఇతర వివరాలు ఇచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెప్పినట్లు తెలిసింది. మొదట యునినార్ ప్రతినిధులను నాలుగు గంటలపాటు ప్రశ్నించి పంపించ‌గా ఆ తర్వాత వొడాఫోన్‌ ప్రతినిధుల విచారణ రాత్రి 7 గంటలదాకా సాగింది. ఆ తర్వాత డొకొమో, రిలయన్స్‌, ఐడియా ప్రతినిధుల విచారణ జరిగింది. వీరిని రాత్రి 10.30 గంటల వరకు ప్ర‌శ్నించారు.

First Published:  23 Jun 2015 6:11 AM IST
Next Story