సిస్టర్ నిర్మల కన్నుమూత
మిషన్ ఆఫ్ చారటీస్ అధ్యక్షురాలు సిస్టర్ నిర్మల (81) కన్నుమూశారు. మదర్ థెరిస్సా తర్వాత 1997లో మిషన్ ఆఫ్ చారిటీస్ బాధ్యతలను నిర్మల చేపట్టారు. నిర్మల 1934, జూలై 23న రాంచిలో జన్మించారు. భారతదేశాన్ని బ్రిటిష్ నాయకులు పాలిస్తున్న సమయంలో నిర్మల జన్మించారు. ఆమె అసలు పేరు నిర్మల జోషి. స్వతహాగా హిందు మతస్తురాలైన నిర్మల 1958 తర్వాత రోమన్ కేథలిక్‌గా మారారు. పోలిటికల్ సైన్స్‌లో ఆమె మాస్టర్ డిగ్రీ చేశారు. సిస్టర్ నిర్మల చేసిన మానవ […]
BY sarvi23 Jun 2015 5:36 AM IST
X
sarvi Updated On: 23 Jun 2015 7:03 AM IST
మిషన్ ఆఫ్ చారటీస్ అధ్యక్షురాలు సిస్టర్ నిర్మల (81) కన్నుమూశారు. మదర్ థెరిస్సా తర్వాత 1997లో మిషన్ ఆఫ్ చారిటీస్ బాధ్యతలను నిర్మల చేపట్టారు. నిర్మల 1934, జూలై 23న రాంచిలో జన్మించారు. భారతదేశాన్ని బ్రిటిష్ నాయకులు పాలిస్తున్న సమయంలో నిర్మల జన్మించారు. ఆమె అసలు పేరు నిర్మల జోషి. స్వతహాగా హిందు మతస్తురాలైన నిర్మల 1958 తర్వాత రోమన్ కేథలిక్‌గా మారారు. పోలిటికల్ సైన్స్‌లో ఆమె మాస్టర్ డిగ్రీ చేశారు. సిస్టర్ నిర్మల చేసిన మానవ సేవకు గాను అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డుతో 2009 జనవరి 26న ఆమెను సత్కరించింది భారత ప్రభుత్వం. సిస్టర్ నిర్మల కన్నుమూశారన్న వార్త తెలిసిన భారత ప్రధాని నరేంద్రమోడి ఆమె మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. నిర్మల మరణం ప్రపంచానికి తీరని లోటు అని మమతా అన్నారు.
Next Story