Telugu Global
Others

దేశ వ్యాప్త ఎంఎస్ఓగా రిల‌యెన్స్ జియో

దేశ వ్యాప్తంగా మ‌ల్టీ స‌ర్వీస్ ఆప‌రేట‌ర్ (ఎంఎస్ఓ)గా త‌న సేవ‌లు అందించాల‌నుకుంటోంది రిల‌యెన్స్ సంస్థ‌. ఇందుకు సంబంధించి రిల‌యెన్స్ జియో మీడియా అనే సంస్థ‌ను ఏర్పాటు చేసింది. ఈ సేవ‌లు అందించేందుకు త‌మ‌కు తాత్కాలిక అనుమ‌తులు ల‌భించిన‌ట్టు ఆ సంస్థ బొంబే స్టాక్ ఎక్స్చేంజీకి తెలిపింది.  ప్రాథ‌మిక అనుమ‌తులు ల‌భించ‌డంతో డిజిట‌ల్ అడ్రెస‌బుల్ విధానం (డీఏఎస్)లో మొత్తం దేశ వ్యాప్తంగా ప్ర‌సారాల‌ను అందించేందుకు రిల‌యెన్స్ స‌న్న‌ద్ధ‌మవుతోంది. రిల‌యెన్స్ జియోను స‌మీకృత వ్యాపార బ్రాండుగా అభివృద్ధి చేయాల‌ని యోచిస్తున్న […]

దేశ వ్యాప్తంగా మ‌ల్టీ స‌ర్వీస్ ఆప‌రేట‌ర్ (ఎంఎస్ఓ)గా త‌న సేవ‌లు అందించాల‌నుకుంటోంది రిల‌యెన్స్ సంస్థ‌. ఇందుకు సంబంధించి రిల‌యెన్స్ జియో మీడియా అనే సంస్థ‌ను ఏర్పాటు చేసింది. ఈ సేవ‌లు అందించేందుకు త‌మ‌కు తాత్కాలిక అనుమ‌తులు ల‌భించిన‌ట్టు ఆ సంస్థ బొంబే స్టాక్ ఎక్స్చేంజీకి తెలిపింది. ప్రాథ‌మిక అనుమ‌తులు ల‌భించ‌డంతో డిజిట‌ల్ అడ్రెస‌బుల్ విధానం (డీఏఎస్)లో మొత్తం దేశ వ్యాప్తంగా ప్ర‌సారాల‌ను అందించేందుకు రిల‌యెన్స్ స‌న్న‌ద్ధ‌మవుతోంది. రిల‌యెన్స్ జియోను స‌మీకృత వ్యాపార బ్రాండుగా అభివృద్ధి చేయాల‌ని యోచిస్తున్న ఈసంస్థ ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. దీంతో హాత్‌వే, ఐఎంసీఎల్‌, సిటీ కేబుల్ నెట్‌వ‌ర్క్‌, డిజి కేబుల్‌, డెన్ నెట్‌వ‌ర్క్ సంస్థ‌ల‌కు రిల‌యెన్స్ జియో మంచి పోటీ ఇస్తుంద‌ని భావిస్తున్నారు. దీంతోపాటు కేబుల్ టీవీలో త‌మ సంస్థ‌ల కార్య‌క‌లాపాల‌ను ప్ర‌సారం చేయ‌డానికి కూడా వీల‌వుతుంది. రిల‌యెన్స్ సంస్థ ఇప్ప‌టికే నెట్‌వ‌ర్క్-18, ఐబీఎన్ వంటి ఛాన‌ళ్ళ‌తోపాటు 14 వినోదాత్మ‌క ఛాన‌ళ్ళ‌ను కొనుగోలు చేసి ప్ర‌సారాల‌ను చేస్తోంది.
First Published:  22 Jun 2015 6:47 PM IST
Next Story