రైల్లో అప్పర్ బెర్త్‌కు కొత్త నిచ్చెన
ట్రైనులో అప్పర్ బెర్త్ ఎలా ఎక్కాల్రా బాబూ అని తలబట్టుకునే వారికి శుభవార్త. అప్పర్ బెర్త్ ఎక్కడానికి రైల్వేశాఖ సరికొత్త నిచ్చెనలు ఏర్పాటు చేయనుందని రైల్వే బోర్డు మెంబర్ హేమంత్ కుమార్ వెల్లడించారు. అప్పర్ బెర్త్ ఎక్కేందుకు ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులను గమనించిన రైల్వేశాఖ ఒక్కో బోగీకీ రూ. 20 వేల ఖర్చుతో కొత్త తరహా నిచ్చెనలు ఏర్పాటు చేయనుందని ఆయన చెప్పారు. ఇవి ప్రయాణీకులు తమకు అనువైన రీతిలో పట్టుకునేందుకు, పాదం పెట్టుకునేందుకు, సులువుగా అప్పర్ […]
ట్రైనులో అప్పర్ బెర్త్ ఎలా ఎక్కాల్రా బాబూ అని తలబట్టుకునే వారికి శుభవార్త. అప్పర్ బెర్త్ ఎక్కడానికి రైల్వేశాఖ సరికొత్త నిచ్చెనలు ఏర్పాటు చేయనుందని రైల్వే బోర్డు మెంబర్ హేమంత్ కుమార్ వెల్లడించారు. అప్పర్ బెర్త్ ఎక్కేందుకు ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులను గమనించిన రైల్వేశాఖ ఒక్కో బోగీకీ రూ. 20 వేల ఖర్చుతో కొత్త తరహా నిచ్చెనలు ఏర్పాటు చేయనుందని ఆయన చెప్పారు. ఇవి ప్రయాణీకులు తమకు అనువైన రీతిలో పట్టుకునేందుకు, పాదం పెట్టుకునేందుకు, సులువుగా అప్పర్ బెర్త్ ను చేరుకునేందుకు ఉపయోగపడుతాయని ఆయన అన్నారు. ఇప్పటికే కొన్ని రైళ్లలోని ఏసీ బోగీల్లో ఏర్పాటు చేసి ఫలితాలను అంచనా వేశామని, త్వరలో అన్ని రైళ్లలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.