తెలంగాణ వ్యాప్తంగా అర్థరాత్రి నుంచి లారీల సమ్మె
పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ పెంపునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి లారీలు సమ్మెలోకి దిగుతున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లక్ష లారీలతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మూడున్నర లక్షల లారీల్లో సరకు రవాణా మొత్తం బంద్ కానుంది. లారీల సమ్మె కారణంగా నిత్యావసర వస్తువుల రవాణా స్తంభించపోనుంది.ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రవాణా పన్ను విధానాన్ని లారీ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పన్ను విధానంలో ఉమ్మడి రాష్ట్రంలో చెల్లుబాటయ్యేలా తాము […]
BY sarvi23 Jun 2015 4:50 AM GMT
X
sarvi Updated On: 23 Jun 2015 4:50 AM GMT
పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ పెంపునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి లారీలు సమ్మెలోకి దిగుతున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లక్ష లారీలతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మూడున్నర లక్షల లారీల్లో సరకు రవాణా మొత్తం బంద్ కానుంది. లారీల సమ్మె కారణంగా నిత్యావసర వస్తువుల రవాణా స్తంభించపోనుంది.ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రవాణా పన్ను విధానాన్ని లారీ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పన్ను విధానంలో ఉమ్మడి రాష్ట్రంలో చెల్లుబాటయ్యేలా తాము చెల్లించిన త్రైమాసిక పన్ను నుంచి ఏపీలోని 13 జిల్లాలకు పన్ను మినహాయించాలని, ఇరు రాష్ట్రాల్లో తిరిగేందుకు అనుమతి ఇస్తూ యేటా మూడు నుంచి ఐదు వేల రూపాయల వరకు పన్ను తీసుకుని కౌంటర్ సిగ్నేచర్ పర్మిషన్లు ఇవ్వాలని, 15 యేళ్ళు నిండిన వాహనాలను రద్దు చేయాలన్న ప్రతిపాదనలపై చర్చలకు పిలవాలని, సరకు లోడింగ్, అన్‌లోడింగ్ సమయాల్లో రక్షణ కల్పించాలని, జిల్లా, తాలూకా కేంద్రాల్లో ట్రక్కు టెర్మినల్స్, ట్రక్ పార్కింగ్‌లు ఏర్పాటు చేయాలని లారీ యజమానులు డిమాండు చేస్తున్నారు. కాగా ఇవే డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా లారీ యజమానులు సమ్మెకు ప్రయత్నించారు. అయితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. డిమాండ్లపై చర్చకు, పరిష్కారానికి మరో పది రోజుల సమయం ఇవ్వాలని ఐవైఆర్ కోరగా ఏపీ లారీ యజమానులు అంగీకరించారు. ఒకవేళ పది రోజుల్లోగా సమస్యను తెల్చకపోతే తమ బతుకంతా ఊడిగం చేస్తామని వారు అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
Next Story