Telugu Global
Cinema & Entertainment

ఇది క్రైమ్ కామెడీ : కోన వెంకట్

స్వామి రారా, కార్తికేయ, సూర్య వెర్సస్ సూర్య.. ఇలా వరుసగా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ, ముందుకు దూసుకెళుతున్న నిఖిల్ ప్రస్తుతం మరో విభిన్నమైన చిత్రంలో నటిస్తున్నారు. ‘శంకరాభరణం’ పేరుతో కోన వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ. సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. ‘గీతాంజలి’ వంటి విజయం తర్వాత ఎంవీవీ సినిమా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇది. పుణేకి 60 కిలోమీటర్ల దూరంలోని బోర్, నగరి, వాయ్ గ్రామాల్లో ఈ చిత్రం షూటింగ్ చేస్తున్నారు. ఈ […]

ఇది క్రైమ్ కామెడీ : కోన వెంకట్
X

స్వామి రారా, కార్తికేయ, సూర్య వెర్సస్ సూర్య.. ఇలా వరుసగా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ, ముందుకు దూసుకెళుతున్న నిఖిల్ ప్రస్తుతం మరో విభిన్నమైన చిత్రంలో నటిస్తున్నారు. ‘శంకరాభరణం’ పేరుతో కోన వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ. సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. ‘గీతాంజలి’ వంటి విజయం తర్వాత ఎంవీవీ సినిమా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇది. పుణేకి 60 కిలోమీటర్ల దూరంలోని బోర్, నగరి, వాయ్ గ్రామాల్లో ఈ చిత్రం షూటింగ్ చేస్తున్నారు. ఈ నెల 15న మొదలైన ఈ షెడ్యూల్ 25 వరకూ సాగుతుంది.

చిత్రవిశేషాలను కోన వెంకట్ తెలియజేస్తూ – ”ఇది క్రైమ్ కామెడీ మూవీ. బీహార్ నేపథ్యంలో సాగుతుంది. కథానుసారం ‘శంకరాభరణం’ పెట్టాం. నాటి చిత్రానికీ, ఈ ‘శంకరాభరణం’కీ సంబంధం లేదు. క్రైమ్ మూవీ కాబట్టి, చాలా రిస్కీ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతాం. ఎంత రిస్కీ అంటే మనుషులు వెళ్లడానికి భయపడతారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది” అని చెప్పారు.
ఎం.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ – ”మా సంస్థ నుంచి వచ్చిన ‘గీతాంజలి’ ఘనవిజయం సాధించింది. మలి చిత్రం కూడా అలానే ఉండాలని తొమ్మిది నెలలు వెయిట్ చేసి, ఈ చిత్రకథను ఎంపిక చేశాం. కోన వెంకట్ అద్భుతమైన కథ ఇచ్చారు” అన్నారు.
రావు రమేశ్, సత్యం రాజేశ్, షకలక శంకర్, సుజయ్ మిశ్రా, పిటూబాష్ త్రిపాఠి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఎడిటింగ్: నవీన్ నూలి, రచనా సహకారం: వెంకటేశ్ కిలారు, భవాని ప్రసాద్, డ్యాన్స్ మాస్టర్స్: శేఖర్-శివ, ఫైట్ మాస్టర్: విజయ్, మేనేజర్స్: నాగు-రవి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహ నిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు: కోన వెంకట్,

First Published:  23 Jun 2015 7:18 AM IST
Next Story