తిట్టిన నోటితోనే పొగడ్తలు!
నరేంద్రమోడీని నరహంతకుడన్నారు… హైదరాబాద్‌లో కాలుమోపనివ్వనన్నారు. గోధ్రా అనంతర అల్లర్లు దేశానికే మాయని మచ్చ అని తిట్టిపోశారు. ఇపుడు నరేంద్ర మోడీని వివేకానందుడితో పోల్చారు. “నాడు నరేంద్రుడు.. స్వామి వివేకానంద యోగా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాడు. నేడు నరేంద్రుడు… మోడీ ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని జరుపుకునేలా చేశారు.” అని కొనియాడారు. ఇలాంటి రెండు నాల్కలు ఎవరికి ఉన్నాయో తెలుసా? తిట్టిన నోటితోనే పొగడగలిగిన వారెవరో మీరు కనుక్కోగలరా? ఇంకెవరండీ… తెలుగుదేశం పార్టీ అధినేత […]
BY sarvi23 Jun 2015 6:00 AM IST
X
sarvi Updated On: 23 Jun 2015 9:37 AM IST
నరేంద్రమోడీని నరహంతకుడన్నారు… హైదరాబాద్‌లో కాలుమోపనివ్వనన్నారు. గోధ్రా అనంతర అల్లర్లు దేశానికే మాయని మచ్చ అని తిట్టిపోశారు. ఇపుడు నరేంద్ర మోడీని వివేకానందుడితో పోల్చారు. “నాడు నరేంద్రుడు.. స్వామి వివేకానంద యోగా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాడు. నేడు నరేంద్రుడు… మోడీ ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని జరుపుకునేలా చేశారు.” అని కొనియాడారు. ఇలాంటి రెండు నాల్కలు ఎవరికి ఉన్నాయో తెలుసా? తిట్టిన నోటితోనే పొగడగలిగిన వారెవరో మీరు కనుక్కోగలరా?
ఇంకెవరండీ… తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారే.. నారా వారికి రెండు కాదు వేయినాల్కలున్నాయి. అది 2002 నాటి మాట. బీజేపీతో ఇక ఉపయోగం లేదని భావించి తెగతెంపులు చేసుకుంటున్న రోజులు. నాడు నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబేమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలోనూ చక్రం తిప్పుతున్నారు (అలా ప్రచారం చేసుకునేవారు). అందుకే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ ని బాబు చిన్నచూపు చూశారు. ఆయన కన్నా తానే పెద్ద లీడర్ ని అని చంద్రబాబు అనుకునేవారు. అందుకే గోధ్రా అనంతర అల్లర్లపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. నరేంద్ర మోడిని దుమ్మెత్తిపోశారు. హైదరాబాద్‌లో కాలుమోపనివ్వనన్నారు. ఇపుడు పరిస్థితి తల్లకిందులైంది. ఉమ్మడి రాష్ట్రం కాస్తా ముక్కలైంది (బాబుకు కూడా భాగం ఉందనుకోండి). చిన్న రాష్ర్టానికి అరకొర మెజారిటీతో బాబు ముఖ్యమంత్రి అయ్యారు. మిత్రపక్షమే అయినా కేంద్రంలో టీడీపీ ఎంపీలతో పనే లేకుండా పోయింది. మోడీ తిరుగులేని మెజారిటీతో అఖండ భారత్‌కు ప్రధానమంత్రి అయ్యారు. బాబు చక్రం తిప్పినట్లు చెప్పుకొన్న రోజుల్లో ఆయన మాట విన్న అద్వానీ, వెంకయ్య లాంటి వారంతా డమ్మీలుగా మారిపోయారు. మోడీ తన సొంత కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ బలంతో కేంద్రానికి పనిలేకుండా పోవడమే కాదు.. ఇక్కడ రోజుకో కుంభకోణంలో పడి బాబు విలవిల్లాడుతున్నారు. అందుకే ఇపుడు కేంద్రానికి సాగిలపడడం… వీలు చిక్కినప్పుడల్లా మోడీని పొగడ్తలలో ముంచెత్తడం…
– చరణ్
Next Story