కడపలో ఉక్కు కర్మాగారానికి కేంద్రమంత్రికి బాబు వినతి
కడపలో ఉక్కు కర్మాగారాన్ని స్థాపించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి నరేంద్రకుమార్ తోమర్‌కు విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని 13 షెడ్యూలులో ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని బాబు కోరారు. రాష్ట్రంలో కొత్త ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి గల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఉక్కు శాఖ, దాని ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఓ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. రాష్ట్రంలో […]
BY sarvi22 Jun 2015 6:36 PM IST
sarvi Updated On: 23 Jun 2015 6:30 AM IST
కడపలో ఉక్కు కర్మాగారాన్ని స్థాపించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి నరేంద్రకుమార్ తోమర్‌కు విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని 13 షెడ్యూలులో ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని బాబు కోరారు. రాష్ట్రంలో కొత్త ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి గల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఉక్కు శాఖ, దాని ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఓ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. రాష్ట్రంలో ఉక్కు, గనుల రంగంలో పెట్టుబడి అవకాశాలపై వీరిద్దరూ సవివరంగా చర్చించారు. రాష్ట్రంలోని గనులన్నింటినీ పారదర్శకంగా వేలం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని కేంద్రమంత్రి తోమర్ అభ్యర్థించారు. ఖనిజాల వెలికితీతలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జీఎస్ఐ, ఎంఈసీఎల్‌లు తగిన విధంగా సహకరిస్తాయని ఆయన తెలిపారు. పుష్కలంగా నీరు, భూమి, ఖనిజ వనరులు ఉన్న తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామివేత్తలను ప్రోత్సహించాలని చంద్రబాబు కేంద్రమంత్రిని కోరారు.
Next Story