నిందితులకు షెల్టర్ జోన్ ఏపీ!
అనుకున్నదంతా అయింది.. తెలంగాణలో నిందితులనీ తెలిసీ వారికి ఏపీ సర్కారు, పోలీసులు, లాయర్లు మద్దతుగా నిలుస్తున్నారని తెలంగాణ ఏసీబీ కేంద్రానికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. మే నెల 31న తెలంగాణలో ఓటుకు నోటు ఎర కేసులో తప్పించుకున్న జెరుసలేం మత్తయ్య ప్రధాననిందితుల్లో ఒకడు. ఈ మేరకు దినపత్రికలు, టీవీల్లో అతని ప్రమేయంపై వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. అయినా అతడు విజయవాడకు పారిపోయాడు. అతడు తెలంగాణ రాష్ర్టంలో ఓ ప్రధాన కేసులో నిందితుడని తెలిసినా విజయవాడ పోలీసులు తెలంగాణ […]
BY sarvi23 Jun 2015 5:47 AM IST
X
sarvi Updated On: 23 Jun 2015 5:53 AM IST
అనుకున్నదంతా అయింది.. తెలంగాణలో నిందితులనీ తెలిసీ వారికి ఏపీ సర్కారు, పోలీసులు, లాయర్లు మద్దతుగా నిలుస్తున్నారని తెలంగాణ ఏసీబీ కేంద్రానికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. మే నెల 31న తెలంగాణలో ఓటుకు నోటు ఎర కేసులో తప్పించుకున్న జెరుసలేం మత్తయ్య ప్రధాననిందితుల్లో ఒకడు. ఈ మేరకు దినపత్రికలు, టీవీల్లో అతని ప్రమేయంపై వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. అయినా అతడు విజయవాడకు పారిపోయాడు. అతడు తెలంగాణ రాష్ర్టంలో ఓ ప్రధాన కేసులో నిందితుడని తెలిసినా విజయవాడ పోలీసులు తెలంగాణ పోలీసులకు కనీసం సమాచారం ఇవ్వలేదు.. స్టేషన్‌కు వచ్చినా అరెస్టుచేయలేదు. పైగా అతడు ఇచ్చిన తప్పుడు సమాచారంతో కేసులు నమోదు చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయంలో ఏపీ పోలీసులు తెలంగాణకు సహకరించకపోగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఈ మేరకు నివేదిక పంపింది. గత కొన్నిరోజులుగా ఓటుకు నోటు ఎర కేసులో నిందితులుగా ఉన్న ఏపీ మత్తయ్య, ఎమ్మెల్యే సండ్రలకు ఆశ్రయం కల్పిస్తున్న విషయమై ఆధారాలతో సహా సమర్పించారు. ఏపీ ప్రభుత్వం భారత చట్టాలను అపహాస్యం చేస్తూ నిందితులకు ఆశ్రయం కల్పిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ కూడా దేశంలో భాగమే.కానీ అక్కడి ప్రభుత్వం నిందితులకు ఆశ్రయం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను నిందితులకు షెల్టర్ జోన్‌గా మార్చారని వివరించారు. పైగా కేసు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డుపడుతోందని ఆధారాలు సమర్పించారు.
Next Story