వ్యవసాయమంత్రితో ఏపీ కాంగ్రెస్ నేతల భేటీ
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఏపీ కాంగ్రెస్ నేతలు కలిశారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలని, బ్యాంక్‌లు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంత ప్రాజెక్ట్‌ను తక్షణం అమలు చేయాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఏపీ కాంగ్రెస్ నేతలు విన్నవించారు. అనంతపురం జిల్లాలో వేరు శెనగ, గడ్డి విత్తనాలకు కొరత ఉందని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే రాబోయే కాలంలో […]
BY sarvi22 Jun 2015 6:51 PM IST
sarvi Updated On: 23 Jun 2015 11:43 AM IST
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఏపీ కాంగ్రెస్ నేతలు కలిశారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలని, బ్యాంక్‌లు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంత ప్రాజెక్ట్‌ను తక్షణం అమలు చేయాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఏపీ కాంగ్రెస్ నేతలు విన్నవించారు. అనంతపురం జిల్లాలో వేరు శెనగ, గడ్డి విత్తనాలకు కొరత ఉందని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే రాబోయే కాలంలో ఎరువులు, పురుగుమందుల కొరత లేకుండా చూడాలని కూడా వారు మంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
Next Story