ప్రకాశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అవినీతి
హైదరాబాద్‌లో అవినీతి మకిలి అంటుకున్నా తెలుగుదేశం పార్టీ నేతలకు ఇంకా జ్హానోదయం కాలేదు. ఇదే రీతి నెల్లూరులోనూ ప్రదర్శించారు. ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అవినీతికి పట్టం కట్టాలని ప్రయత్నిస్తోంది. తన పార్టీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించుకోడానికి వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఏంపీటీసీ సభ్యులను కొనేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాము చెప్పినట్టు విని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అట్లా చిన వెంకటరెడ్డికి కాకుండా తమ […]
BY sarvi23 Jun 2015 2:54 AM GMT
X
sarvi Updated On: 23 Jun 2015 11:50 PM GMT
హైదరాబాద్‌లో అవినీతి మకిలి అంటుకున్నా తెలుగుదేశం పార్టీ నేతలకు ఇంకా జ్హానోదయం కాలేదు. ఇదే రీతి నెల్లూరులోనూ ప్రదర్శించారు. ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అవినీతికి పట్టం కట్టాలని ప్రయత్నిస్తోంది. తన పార్టీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించుకోడానికి వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఏంపీటీసీ సభ్యులను కొనేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాము చెప్పినట్టు విని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అట్లా చిన వెంకటరెడ్డికి కాకుండా తమ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డికి ఓటు వేయాలని లేకపోతే కష్టాలు తప్పవని, అధికారంలో ఉన్న పార్టీ తమదేనని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇక చేసేది లేక దాదాపు 30 మంది ఎంపీటీసీలు టీడీపీ దారికి వెళ్ళారు. ఒక్కక్కరికీ మూడు లక్షల బేరం… ముందుగా రూ. 50 వేలు అడ్వాన్స్. ఈ అంకం పూర్తయిన తర్వాత మిగిలిన సొమ్ము ఇస్తాం రమ్మంటూ కబురు చేశారు. అందరూ వచ్చిన తర్వాత ఒక వాహనంలో ఎక్కించుకుని నెల్లూరుకు తీసుకుపోయి అక్కడ సప్తగిరి లాడ్జిలో దాచి పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తమ అనుచరులతో సదరు లాడ్జీని చుట్టుముట్టారు. లాడ్జీలో ఉన్న వారి ఆచూకీ కోసం ప్రయత్నించారు. లాడ్జి నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో రిజిస్టర్ తెప్పించి పేర్లు పరిశీలించారు. ఇంకేంటి? దొంగలు దొరికారు. గదుల్లో ఉన్నవారంతా ప్రకాశం జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. వారి వద్దకెళ్ళి ప్రశ్నించగా అధికారపార్టీ వాళ్ళు తమను బలవంతంగా ఇక్కడకు తీసుకువచ్చారని చెప్పారు. తాము చెప్పినట్టు వినకపోతే భవిష్యత్‌లో కష్టాలు తప్పవని బెదిరించారని వారు ఆరోపించారు. ఈలోగా పోలీసులకు సమాచారం అందింది. వారొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సాయుధ బలగాలతో బలవంతంగా షట్టర్లు వేసి పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక రాష్ట్ర మంత్రి నారాయణ హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. మరొక విషయం ఏమిటంటే… టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందినవాడు కావడం గమనార్హం.
Next Story