వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో రాజుల కలకలం!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇపుడు బొబ్బిలి రాజుల గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉత్తరాంధ్ర విభాగంలో బొబ్బిలి రాజవంశానికి చెందిన సుజయ్‌కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీ నాయన కీలకమైన నాయకులుగా ఉన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా కీలకమైన బాధ్యతలలో ఉన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేరికతో ఉత్తరాంధ్ర రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయంటూ కొద్దికాలంగా మీడియాలో వార్తలొస్తున్నాయి. సుజయ్ సోదరులు […]
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇపుడు బొబ్బిలి రాజుల గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉత్తరాంధ్ర విభాగంలో బొబ్బిలి రాజవంశానికి చెందిన సుజయ్‌కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీ నాయన కీలకమైన నాయకులుగా ఉన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా కీలకమైన బాధ్యతలలో ఉన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేరికతో ఉత్తరాంధ్ర రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయంటూ కొద్దికాలంగా మీడియాలో వార్తలొస్తున్నాయి. సుజయ్ సోదరులు పార్టీని వీడి వేరే పార్టీలో చేరబోతున్నారంటూ కథనాలు వస్తున్నాయి. ఆ వార్తలను వారు ఖండించకపోవడంతో వాటికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్టీ ఉపాధ్యక్షుడు విజయసాయిరెడ్డి ఆదివారం నాడు ఈ బొబ్బిలిలో సుజయ్ సోదరులతో భేటీ అయ్యారు. సుమారు నాలుగుగంటలపాటు వారితో సాయిరెడ్డి చర్చలు జరిపారని సమాచారం. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాత్రం సుజయకృష్ణ ఆధ్వర్యంలోనే తమ పార్టీ ఉత్తరాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. అయితే బొబ్బిలి రాజులు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోనే ఉంటారా లేక పార్టీ మారతారా అన్న విషయం త్వరలో తేలనుందని అంటున్నారు.