సిట్ దర్యాప్తు వేగవంతం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతరులపై ఏపీలో నమోదైన 88 కేసులకు సంబంధించి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ ( సిట్ ) విచారణను వేగవంతం చేసింది. ఏపీకి సంబంధించిన కొంతమంది ముఖ్యమైన నాయకుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. ట్యాపింగ్ చేయమని ఎవరు కోరారో, ఎవరి సంతకంతో ఆ లేఖలు వచ్చాయో వెల్లడి చేయాలని ఏపీ సిట్ […]
BY sarvi21 Jun 2015 6:36 PM IST
sarvi Updated On: 22 Jun 2015 11:10 AM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతరులపై ఏపీలో నమోదైన 88 కేసులకు సంబంధించి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ ( సిట్ ) విచారణను వేగవంతం చేసింది. ఏపీకి సంబంధించిన కొంతమంది ముఖ్యమైన నాయకుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. ట్యాపింగ్ చేయమని ఎవరు కోరారో, ఎవరి సంతకంతో ఆ లేఖలు వచ్చాయో వెల్లడి చేయాలని ఏపీ సిట్ అధికారులు కోరారు. ఈ లేఖ ఏ తేదీన అందింది… ట్యాపింగ్ ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకూ జరిగింది, వాటికి సంబంధించిన కాల్ లాగ్స్ తదితర వివరాలను సిట్ అధికారులు సర్వీసు ప్రొవైడర్ల నుంచి కోరుతున్నట్టు సమాచారం.
Next Story