Telugu Global
Others

మార్కెట్లోకి రానున్న ప‌ల్స్ లెస్ హార్ట్ 

ల‌బ్‌డ‌బ్ … ల‌బ్‌డ‌బ్ … అంటూ గుండె శ‌బ్దం చేయ‌ట్లేద‌ని మీరేం కంగారు ప‌డొద్దు. ఇక‌పై కొంత‌మంది గుండెలు గుండె ల‌బ్‌డ‌బ్ సౌండ్ చేయ‌క పోయినా వారు  మ‌ర‌ణించిన‌ట్లు కాదు. ఔను. ఇది ముమ్మాటికీ  నిజ‌మే అంటున్నారు డాక్ట‌ర్లు. మ‌రికొద్ది రోజుల్లో ప‌ల్స్ లెస్ హార్టులు మార్కెట్లోకి రానున్నాయ‌ని  వారు చెబుతున్నారు. పల్స్ లెస్ హార్టుల‌తో గుండెజ‌బ్బుల‌తో బాధప‌డుతూ, మ‌ర‌ణానికి చేరువ‌గా ఉన్న‌వారికి కొత్త ఊపిరి పోయ‌వ‌చ్చ‌ని డాక్ట‌ర్లు స్ప‌ష్టం చేస్తున్నారు.  మాన‌వ శ‌రీరంలో గుండె ప్ర‌ధాన‌మైన […]

మార్కెట్లోకి రానున్న ప‌ల్స్ లెస్ హార్ట్ 
X
ల‌బ్‌డ‌బ్ … ల‌బ్‌డ‌బ్ … అంటూ గుండె శ‌బ్దం చేయ‌ట్లేద‌ని మీరేం కంగారు ప‌డొద్దు. ఇక‌పై కొంత‌మంది గుండెలు గుండె ల‌బ్‌డ‌బ్ సౌండ్ చేయ‌క పోయినా వారు మ‌ర‌ణించిన‌ట్లు కాదు. ఔను. ఇది ముమ్మాటికీ నిజ‌మే అంటున్నారు డాక్ట‌ర్లు. మ‌రికొద్ది రోజుల్లో ప‌ల్స్ లెస్ హార్టులు మార్కెట్లోకి రానున్నాయ‌ని వారు చెబుతున్నారు. పల్స్ లెస్ హార్టుల‌తో గుండెజ‌బ్బుల‌తో బాధప‌డుతూ, మ‌ర‌ణానికి చేరువ‌గా ఉన్న‌వారికి కొత్త ఊపిరి పోయ‌వ‌చ్చ‌ని డాక్ట‌ర్లు స్ప‌ష్టం చేస్తున్నారు.
మాన‌వ శ‌రీరంలో గుండె ప్ర‌ధాన‌మైన అవ‌య‌వం. ల‌బ‌డ‌బ్ మంటూ ప్ర‌తి సెకండూ కొట్టుకుంటూనే ఉంటుంది. బ‌ద్ద‌కించి ఒక్క సెకండు ఆగి పోయినా మనం ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లే. వ‌య‌సు మీద ప‌డిన కొద్దీ అధిక ర‌క్త‌పోటు, గుండె జ‌బ్బులు, హార్ట్ అటాక్‌, గుండె వాల్వులు మూసుకు పోవ‌డం, కండ‌రాలు బ‌ల‌హీన ప‌డ‌టం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల గుండె బ‌ల‌హీన ప‌డుతుంది. దాని సామ‌ర్థ్యం త‌గ్గి పోతుంది. అయితే, ఈ అవ‌య‌వానికి మ‌రో ప్ర‌త్యామ్నాయం లేదు. గుండె మార్పిడి చేసినా అన్ని సంద‌ర్భాల్లోనూ ఆ గుండె మ‌రొక‌రికి స‌రిపోతుంద‌న్న గ్యారెంటీ లేదు. ఈ నేపథ్యంలో డాక్ట‌ర్లు ప్ర‌స్తావిస్తున్న ప‌ల్స్ లెస్ హార్ట్ అభివృద్ధి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆస‌క్తి రేకిత్తిస్తోంది.
ఆర్కిమెడిస్ స్ర్కూ ఆధారంగా…
క్రీ.పూ. మూడో శ‌తాబ్దానికి చెందిన గ్రీకు శాస్త్ర‌వేత్త ఆర్కిమెడిస్ రూపొందించిన స్క్రూ ఆధారంగా రిచ‌ర్డ్ కె.వాంప్ల‌ర్ అనే కార్డియాల‌జిస్టు 1976లో కృత్రిమ గుండె త‌యారీకి పూనుకున్నారు. హీమోపంప్ అనే పేరుతో రిచ‌ర్డ్ రూపొందించిన కృత్రిమ గుండె పెన్సిల్ ఎరేజ‌ర్ సైజులో ఉండేది. 1988లో దీన్ని తొలిసారి ఓ రోగిలో అమ‌ర్చారు. దీంట్లోని స్క్రూని బ్యాట‌రీ సాయంతో తిప్పినప్పుడు గుండెలోని ర‌క్తం శ‌రీర అవ‌య‌వాల‌కు చేరేది. సాధార‌ణ గుండె మాదిరిగా నిమిషానికి 72 సార్లు కాకుండా ఇది నిత్యం తిరుగుతూనే ఉండేది. అందువ‌ల్ల ఈ ప‌రిక‌రం అమ‌ర్చుకున్న వారి గుండె కొట్టుకోదు. అయితే, ఈ గుండె అమ‌ర్చుకున్న వారు ఆస్ప‌త్రికే ప‌రిమిత‌మ‌య్యేవారు. అయితే, ఇదే సూత్రం ఆధారంగా అబియో మెడ్ త‌యారు చేసిన ఇంపెల్లా, టెక్స‌స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ త‌యారు చేసిన హార్ట్ మేట్ 2 హీమోపంప్ స్థానాన్ని భ‌ర్తీ చేశాయి. పెన్సిల్ సైజులో ఉన్న ఈ కృత్రిమ గుండెలేవీ కొట్టుకోవు. పైగా వీటిని అమ‌ర్చుకున్న వ్య‌క్తులు సాధార‌ణ వ్య‌క్తుల్లా జీవితాన్ని గ‌డ‌ప‌వ‌చ్చు. అమెరికా అధ్య‌క్షుడితో పాటు ఇప్ప‌టి వ‌ర‌కూ సుమారు 20 వేల మంది ఈ ప‌రిక‌రాన్ని అమ‌ర్చుకున్నారు. ఈ హార్ట్‌మేట్‌ను మ‌రింత అభివృద్ధి చేయ‌డం ద్వారా భ‌విష్య‌త్‌లో గుండెకు మెరుగైన ప్ర‌త్యామ్నాయం ల‌భిస్తుంద‌ని, ఏటా కొన్ని ల‌క్ష‌ల‌ మందిని మ‌రణం నుంచి దూరం చేయ‌వ‌చ్చున‌ని శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు.
First Published:  22 Jun 2015 2:04 AM GMT
Next Story