టీఆర్‌ఎస్ వైపు జయసుధ చూపు?
సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ తెలంగాణ రాష్ట్ర సమితి వైపు చూస్తున్నారు. తమతో కలిసి పని చేయాలని ఆ పార్టీ పెద్దల నుంచి సంకేతాలు రావడంతో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆమె సన్నద్దమవుతున్నారని తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సెటిలర్ల ఓట్లను ఆకట్టుకునే అంశంలో ఆమె ఉపయోగపడుతుందని టీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆ పార్టీ నాయకత్వం జయసుధను చేర్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన కాంగ్రెస్ నాయకులు ఆమె వెళ్ళిపోవడం కన్నా తామే పంపించేశామన్న […]
BY sarvi22 Jun 2015 11:24 AM IST
X
sarvi Updated On: 22 Jun 2015 11:24 AM IST
సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ తెలంగాణ రాష్ట్ర సమితి వైపు చూస్తున్నారు. తమతో కలిసి పని చేయాలని ఆ పార్టీ పెద్దల నుంచి సంకేతాలు రావడంతో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆమె సన్నద్దమవుతున్నారని తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సెటిలర్ల ఓట్లను ఆకట్టుకునే అంశంలో ఆమె ఉపయోగపడుతుందని టీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆ పార్టీ నాయకత్వం జయసుధను చేర్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన కాంగ్రెస్ నాయకులు ఆమె వెళ్ళిపోవడం కన్నా తామే పంపించేశామన్న భావన కల్పించాలని భావిస్తున్నారు. అందుకే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది. గత కొంత కాలంగా ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో ఆమె పెద్దగా పాల్గొనలేదని, నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ నేతలతో కలవడం లేదని జయసుధపై ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు మాజీ మేయర్ బండారు కార్తీకరెడ్డితో కూడా జయసుధకు వివాదాలు ఏర్పడిన విషయం తెలిసిందే. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ జయసుధపై వేటు వేస్తే మంచిదని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Next Story