వరంగల్ బరిలో బీజేపీ!
వరంగల్ ఎంపీ బరిలో దిగాలని బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కడియం శ్రీహరి రాజీనామాతో ప్రస్తుతం ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే! తాజాగా ఈ విషయంపై రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేతృత్వంలో కీలక నేతలు సమావేశమై చర్చించారు. ఓటుకు నోటు ఎర కేసులో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన టీడీపీ బరిలోకి దిగే అవకాశాలు కనిపించకపోవడంతో పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశంలో జరుగుతున్న అభివృద్ధి, మోదీ చరిష్మా, స్వచ్ఛభారత్‌తో బీజేపీకి కావాల్సిన ప్రచారం […]
వరంగల్ ఎంపీ బరిలో దిగాలని బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కడియం శ్రీహరి రాజీనామాతో ప్రస్తుతం ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే! తాజాగా ఈ విషయంపై రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేతృత్వంలో కీలక నేతలు సమావేశమై చర్చించారు. ఓటుకు నోటు ఎర కేసులో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన టీడీపీ బరిలోకి దిగే అవకాశాలు కనిపించకపోవడంతో పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశంలో జరుగుతున్న అభివృద్ధి, మోదీ చరిష్మా, స్వచ్ఛభారత్‌తో బీజేపీకి కావాల్సిన ప్రచారం వచ్చింది. ఇవే అంశాలతో ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎలాగూ టీడీపీ అంతర్గతంగా మద్దతిస్తుంది. ఆ ఓట్లు కూడా తమకే వస్తే.. మరింత లాభిస్తుందన్నది పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. కానీ, వరంగల్‌లో బీజేపీకి క్షేత్రస్థాయిలో టీడీపీ, టీఆర్ ఎస్‌కు ఉన్నంత కార్యకర్తల బలం, నాయకులు లేరన్నది వాస్తవం. టీడీపీ మద్దతిస్తే అది పెద్ద విషయమే కాదన్నది స్థానిక బీజేపీ నేతల వాదన. రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పట్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపించడం లేదు.