చంద్రబాబే మా సీఎం: బాలకృష్ణ
ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చిన తర్వాత టీడీపీలో రకరకాల ప్రచారాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు సీఎం పదవికి రాజీనామా చేస్తారని, ఆయన రాజీనామా చేస్తే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారన్న రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి, ఆయన కుమారుడు లోకేష్, బావమరిది బాలకృష్ణ, కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు… ఇలా రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం బసవతారకం కేన్సర్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న […]
BY Pragnadhar Reddy22 Jun 2015 12:32 PM IST
X
Pragnadhar Reddy Updated On: 22 Jun 2015 12:32 PM IST
ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చిన తర్వాత టీడీపీలో రకరకాల ప్రచారాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు సీఎం పదవికి రాజీనామా చేస్తారని, ఆయన రాజీనామా చేస్తే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారన్న రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి, ఆయన కుమారుడు లోకేష్, బావమరిది బాలకృష్ణ, కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు… ఇలా రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం బసవతారకం కేన్సర్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆ సంస్థ ఛైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ తాను చంద్రబాబు స్థానంలో సీఎంగా బాధ్యతలు చేపడతానన్న వార్తల్లో నిజం లేదని వివరించారు. ఎప్పటికీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆయన నాయకత్వంలోనే తాము పని చేస్తామని అన్నారు. తాను ముఖ్యమంత్రి అవుతానని వచ్చిన వార్తలను సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖండించారు. ప్రభుత్వాన్ని పార్టీని చంద్రబాబే సమర్థవంతంగా నిర్వహించగలరని ఆయన అన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో కేన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని బాలయ్య తెలిపారు.
Next Story