Telugu Global
Others

భార‌త్ ల‌క్ష్యమైన ఉగ్ర మూకలకు పాక్‌ స్వర్గధామం

పాకిస్థాన్‌లో నిరాఘాటంగా నిర్వహణ, శిక్షణ, ర్యాలీలు, ప్రచారం, నిధుల సమీకరణలను చేస్తున్న ఉగ్రవాద సంస్థలకు భారతదేశం ఇప్పటికీ ప్రధాన లక్ష్యంగానే ఉందని అమెరికా వెల్ల‌డించింది. లష్కరే తాయిబాకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉగ్రవాదులకు ఆ దేశం నేటికీ స్వర్గధామంగానే ఉందని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తెహ్రీక్‌-ఎ-తాలిబాన్‌ వంటి సంస్థలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్న పాకిస్థాన్‌ సైన్యం… లష్కరే తాయిబా వంటి ఉగ్రవాద సంస్థలను చూసీ చూడనట్లు వదిలిపెట్టిందని ఉగ్రవాదంపై 2014 వార్షిక […]

పాకిస్థాన్‌లో నిరాఘాటంగా నిర్వహణ, శిక్షణ, ర్యాలీలు, ప్రచారం, నిధుల సమీకరణలను చేస్తున్న ఉగ్రవాద సంస్థలకు భారతదేశం ఇప్పటికీ ప్రధాన లక్ష్యంగానే ఉందని అమెరికా వెల్ల‌డించింది. లష్కరే తాయిబాకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉగ్రవాదులకు ఆ దేశం నేటికీ స్వర్గధామంగానే ఉందని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తెహ్రీక్‌-ఎ-తాలిబాన్‌ వంటి సంస్థలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్న పాకిస్థాన్‌ సైన్యం… లష్కరే తాయిబా వంటి ఉగ్రవాద సంస్థలను చూసీ చూడనట్లు వదిలిపెట్టిందని ఉగ్రవాదంపై 2014 వార్షిక నివేదికలో అమెరికా వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలకు పాకిస్థాన్‌ మద్దతునిస్తుందని భారత్‌ ఆరోపిస్తున్నట్లు కూడా తెలిపింది. పాక్‌లో తిష్ట వేసిన అల్‌కాయిదా, హక్కానీ నెట్‌వర్క్‌, తెహ్రీక్‌-ఎ-తాలిబాన్‌ పాకిస్థాన్‌, లష్కర్‌-ఐ-ఝాంగ్వి వంటి ఉగ్రవాద బృందాలు ప్రపంచవ్యాప్తంగా దాడులకు సన్నద్ధమవుతున్నాయని పేర్కొంది. ఇప్పటికే పొరుగుదేశాల చొరబాటుదారులు, స్వదేశీ అల్లరిమూకలు, మావోయిస్టులను ఎదుర్కొంటున్న భారత్‌ను ఈ ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయని వివరించింది.
First Published:  20 Jun 2015 7:15 PM IST
Next Story