Telugu Global
Others

వ‌చ్చేనెల 3 నుంచి తెలంగాణ‌లో హ‌రిత‌హారం

జులై 3 నుంచి 10 వరకు రాష్ర్ట వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని, దీనికి అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం కె. చంద్ర‌శేఖ‌ర‌రావు అధికారులకు ఆదేశించారు. ఖరీఫ్ నేపథ్యంలో రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని ఆయ‌న సూచించారు. రాష్ట్రంలో పేకాట క్లబ్‌లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాలమూరు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు, యాదగిరిగుట్ట-వరంగల్‌ రహదారి విస్తరణ కోసం వెంటనే భూ సేకరణ చేపట్టాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులపై అధికారులతో […]

జులై 3 నుంచి 10 వరకు రాష్ర్ట వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని, దీనికి అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం కె. చంద్ర‌శేఖ‌ర‌రావు అధికారులకు ఆదేశించారు. ఖరీఫ్ నేపథ్యంలో రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని ఆయ‌న సూచించారు. రాష్ట్రంలో పేకాట క్లబ్‌లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాలమూరు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు, యాదగిరిగుట్ట-వరంగల్‌ రహదారి విస్తరణ కోసం వెంటనే భూ సేకరణ చేపట్టాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూసేకరణ చేసేటప్పుడు నిర్వాసితులకు అనుకూల‌మైన‌ విధానం ఉండాలని సీఎం పేర్కొన్నారు. భూములు కోల్పోయే వారితో చర్చలు జరిపి ప్యాకేజీ నిర్ణయించి వెంటనే పరిహారం కూడా అందజేయాలని సూచించారు.
First Published:  20 Jun 2015 7:20 PM IST
Next Story