గబ్బర్ సింగ్-2 డైలాగులు లీక్ ?
స్టార్ హీరో ఎవరైనా సినిమా చేస్తున్నారంటే చాలు.. ఆ మూవీలో డైలాగులు ఇవే అంటూ నెట్ లో కొన్ని ప్రత్యక్షమైపోతాయి. ఫ్యాన్స్ వీరావేశం అనుకోవాలో.. ఆకతాయిల చేష్టలనుకోవాలో అర్థంకాదు. గతంలో మహేష్, పవన్, ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి ఇలానే కొన్ని డైలాగులు నెట్ లో హల్ చల్ చేశాయి. జనాలు కూడా నిజమే అనుకొని నమ్మారు. ఆ డైలాగుల్ని తెగ ఫాలో అయ్యారు. తమ అభిమాన హీరో వాటిని చెబుతున్నట్టు కలలుకన్నారు. తీరా సినిమా విడుదలయ్యాక అప్పటివరకు […]
BY admin21 Jun 2015 5:55 AM IST
X
admin Updated On: 22 Jun 2015 7:01 AM IST
స్టార్ హీరో ఎవరైనా సినిమా చేస్తున్నారంటే చాలు.. ఆ మూవీలో డైలాగులు ఇవే అంటూ నెట్ లో కొన్ని ప్రత్యక్షమైపోతాయి. ఫ్యాన్స్ వీరావేశం అనుకోవాలో.. ఆకతాయిల చేష్టలనుకోవాలో అర్థంకాదు. గతంలో మహేష్, పవన్, ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి ఇలానే కొన్ని డైలాగులు నెట్ లో హల్ చల్ చేశాయి. జనాలు కూడా నిజమే అనుకొని నమ్మారు. ఆ డైలాగుల్ని తెగ ఫాలో అయ్యారు. తమ అభిమాన హీరో వాటిని చెబుతున్నట్టు కలలుకన్నారు. తీరా సినిమా విడుదలయ్యాక అప్పటివరకు నెట్ లో తిరిగిన డైలాగులేవీ అందులో కనిపించవు.
ఇప్పుడు ఇలాంటి స్టంటే ఇంకోటి షురూ అయింది. పవన్ కల్యాణ్ సినిమా మొదలైంది కదా.. ఇక ఆ సినిమాపై ఫేక్ డైలాగులు పుట్టుకొస్తున్నాయి. ఒకటి కాదు..రెండు కాదు.. పదుల సంఖ్యలో డైలాగులు వచ్చేశాయి. సినిమా మొన్ననే ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. టోటల్ మూవీ కంప్లీట్ అవ్వడానికి చాలా నెలల టైం పడుతుంది. కానీ ఇంతలోనే ఇవే డైలాగ్స్ అంటూ ప్రచారం మొదలైంది. వాటిలో మచ్చుకు కొన్ని మీకోసం.
1. నేను పంచ్ లు వేస్తే విజిల్స్ పడతాయ్.. అదే నాపైన పంచ్ లు వేయడానికి ట్రైచేస్తే.. నేనేసే కౌంటర్ కు నువ్వు ఎన్ కౌంటర్ అవుతావ్
2. ఓరే హౌలే నేను గుర్రాన్ని కాదుబే.. నువ్వెక్కి సవారీ చేయనీకి.. సింహాన్ని
3. ఎవడు కొట్టినా బ్లడ్ వస్తుంది.. కానీ నేను కొడితే బ్లడ్ తో పాటు భయం కూడా వస్తుంది.
Next Story