ఇద్దరు మాజీ సీఎంలపై కేసులు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడ్యూరప్ప, హెచ్ డీ కుమారస్వామిలపై అక్రమంగా భూములు డీనోటిఫికేషన్ చేశారన్న ఆరోపణలతో వేసిన కేసులో మూడు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. కాగ్ నివేదిక ఆధారంగా జయకుమార్ హీరేమత్ అనే ఆర్టీఐ కార్యకర్త 2012 సంవత్సరంలో లోకాయుక్తకు చేసిన ఫిర్యాదు ఫలితంగా ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ లు దాఖలయ్యాయి. బెంగళూరు డెవలప్ మెంట్ అథారిటీ (బీడీఏ) ఈ భూములను కేటాయించి, డీనోటిఫై చేయడాన్ని అప్పట్లో కాగ్ తప్పుబట్టింది. తర్వాత ఈ కేసును ప్రాథమిక […]
BY sarvi20 Jun 2015 6:36 PM IST
sarvi Updated On: 21 Jun 2015 4:38 AM IST
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడ్యూరప్ప, హెచ్ డీ కుమారస్వామిలపై అక్రమంగా భూములు డీనోటిఫికేషన్ చేశారన్న ఆరోపణలతో వేసిన కేసులో మూడు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. కాగ్ నివేదిక ఆధారంగా జయకుమార్ హీరేమత్ అనే ఆర్టీఐ కార్యకర్త 2012 సంవత్సరంలో లోకాయుక్తకు చేసిన ఫిర్యాదు ఫలితంగా ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ లు దాఖలయ్యాయి. బెంగళూరు డెవలప్ మెంట్ అథారిటీ (బీడీఏ) ఈ భూములను కేటాయించి, డీనోటిఫై చేయడాన్ని అప్పట్లో కాగ్ తప్పుబట్టింది. తర్వాత ఈ కేసును ప్రాథమిక దర్యాప్తు కోసం సీఐడీ విభాగానికి బదిలీ చేశారు. సీఐడీ చేసిన దర్యాప్తులో.. 2007 నుంచి 2012 వరకు జరిగిన భూముల డీనోటిఫికేషన్లలో అక్రమాలు, చట్ట ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించింది. మొత్తం 40 అక్రమ డీనోటిఫికేషన్లను కాగ్ గుర్తించింది. ఈ కేసులో ఆర్టీఐ డాక్యుమెంట్ల ఆధారంగా కుమారస్వామిని ఎ1 గాను, యడ్యూరప్పను ఎ2గాను పేర్కొన్నారు.
Next Story