కరీంనగర్ జిల్లాలో బౌద్ధ బ్రహ్మ
త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మ విగ్రహం, ఆలయం మనకు ఎక్కడా కనిపించదు. మొదటిసారి ఇప్పుడు కరీంనగర్ జిల్లా కోహెడ మండలం సింగరాయలొద్దిలో ఈ అరుదైన విగ్రహం వెలుగు చూసింది. 6వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న ఈ విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు కనుగొన్నారు. అరుదుగా కొన్నిచోట్ల మాత్రం నాలుగు దిక్కులా నాలుగు శరీరాలతో విగ్రహాలు ఉంటాయి. సింగరాయలొద్దిలో లభించిన ఈ విగ్రహం కూడా నాలుగు శరీరాలతో ఉంది. అయితే, ముందు వైపు పూర్తిగా ఉండగా, మిగతా […]
BY sarvi20 Jun 2015 6:40 PM IST
sarvi Updated On: 21 Jun 2015 7:51 AM IST
త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మ విగ్రహం, ఆలయం మనకు ఎక్కడా కనిపించదు. మొదటిసారి ఇప్పుడు కరీంనగర్ జిల్లా కోహెడ మండలం సింగరాయలొద్దిలో ఈ అరుదైన విగ్రహం వెలుగు చూసింది. 6వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న ఈ విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు కనుగొన్నారు. అరుదుగా కొన్నిచోట్ల మాత్రం నాలుగు దిక్కులా నాలుగు శరీరాలతో విగ్రహాలు ఉంటాయి. సింగరాయలొద్దిలో లభించిన ఈ విగ్రహం కూడా నాలుగు శరీరాలతో ఉంది. అయితే, ముందు వైపు పూర్తిగా ఉండగా, మిగతా మూడు వైపులా అంత స్పష్టంగా లేదు. ముందువైపు జటామలకాలున్న నాలుగు తలలు, రెండు చేతులున్నాయి. ఎడమ చేతిలో కమండలం ఉంది.
ఈ తరహా విగ్రహాలు థాయ్‌లాండ్‌లో ఉంటాయి. ఇప్పుడు లభించిన విగ్రహానికి ఎదురుగా 50 అడుగుల వ్యాసంలో ఇటుకల వృత్తాకార నిర్మాణాలున్నాయి. ఇటుకలు జారి పోకుండా అంచులకు రాతి కట్టడం ఉంది. కాస్త దూరంలో 20 అడుగుల వ్యాసమున్న మట్టి ఒరల బావి జాడ ఉంది. బౌద్ధ హీనయానం నుంచి మహాయాన, వజ్రయానాల కాలంనాటి బౌద్ధక్షేత్రంగా ఈ ప్రాంతం విలసిల్లినట్లు ఈ ఆనవాళ్లు తెలుపుతున్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు చెప్పారు. ఇక్కడ పరిశోధనలు జరిపితే ఎన్నో చారిత్రక విశేషాలు తెలిసే అవకాశం ఉందని వారు అంటున్నారు.
Next Story