Telugu Global
Others

తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు... పొంగుతున్న వాగులు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల రాజమండ్రి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విజ‌య‌వాడ‌, ఏలూరు, రాజ‌మండ్రి, కాకినాడ‌లో ఇంకా భారీ వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గ‌త 48 గంట‌ల్లో కురిసిన వ‌ర్షాల‌కు ఇప్ప‌టికే అత‌లాకుత‌ల‌మై పోయిన ప్రాంతాలు ఇప్పుడు ఈ కుంభ‌వృష్టితో మ‌రింత అల్ల‌క‌ల్లోల‌మ‌య్యే అవ‌కాశం ఉంది. గోదావ‌రి జిల్లాల్లో […]

తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు... పొంగుతున్న వాగులు
X
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల రాజమండ్రి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విజ‌య‌వాడ‌, ఏలూరు, రాజ‌మండ్రి, కాకినాడ‌లో ఇంకా భారీ వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గ‌త 48 గంట‌ల్లో కురిసిన వ‌ర్షాల‌కు ఇప్ప‌టికే అత‌లాకుత‌ల‌మై పోయిన ప్రాంతాలు ఇప్పుడు ఈ కుంభ‌వృష్టితో మ‌రింత అల్ల‌క‌ల్లోల‌మ‌య్యే అవ‌కాశం ఉంది. గోదావ‌రి జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరి పుష్కరాల పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. మ‌రోవైపు మ‌చిలీప‌ట్నం నుంచి స‌ముద్రంలోకి వెళ్ళిన రెండు ప‌డ‌వ‌ల జాడ తెలియ‌కుండా పోయింది. ఈ ప‌డ‌వ‌ల్లో 15 మంది వర‌కు జాల‌ర్లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఓ బాలుడిని బలిగొన్నాయి. ఫిరంగిపురం మండలం మందులపాలెంలో వర్షాల కారణంగా గోడకూలి బాలుడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మ‌రోవైపు కాకినాడ వద్ద సముద్రంలో చేపల వేట కోసం 20 బోట్లలో వెళ్లిన మత్స్యకారులు 60 మంది గల్లంతయ్యారు. మూడు రోజుల నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో మత్స్యకారుల కోసం గాలించడం కష్టంగా మారిందని మంత్రి చెప్పారు. వర్షం తగ్గుముఖం పట్టిన అనంతరం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఏరియల్‌ సర్వే ద్వారా గాలింపు చేపట్టి మత్స్యకారులను సురక్షితంగా బయటకు తీసుకువస్తామని మంత్రి కిషోర్‌బాబు వివరించారు.
స్తంభించిన జనజీవితం… రాకపోకలు
అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో రెండు రాష్ట్రాల్లో కూడా ప‌లుచోట్ల వాహ‌నాలు స్తంభించిపోయాయి. వర్షాలతో పలు రిజర్వాయర్లలో జలకళ సంతరించుకుంది. మరోవైపు రాజమండ్రి- భద్రాచలం రహదారిలో వాగులు పొంగిపొర్లుతుండటంతో ఏపీ, చత్తీస్‌ఘడ్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే చత్తీస్‌గఢ్‌- భద్రాచలం మధ్య కుంట వద్ద వాగులు పొర్లడంతో తెలంగాణ, చత్తీస్‌గఢ్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ ఖ‌మ్మం జిల్లా భద్రాచలంలో గోదావరిలోనీటిమట్టం 15 అడుగులకు చేరింది. ఫ‌లితంగా వాగులు పొంగి పొర్ల‌డంతో 35 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాల్లో ఇళ్ళు నీట మునిగిపోయాయి. వర్షాల కారణంగా సింగ‌రెణిలో 20 వేల ట‌న్నుల బొగ్గు ఉత్ప‌త్తికి ఆటంకం క‌లిగింది. అలాగే పుష్కర పనులకు ఆటంకం ఏర్పడింది. ఎర్రపాలెం మండలం హనుమంతుని గుడి దగ్గర పెద్దవాగు పొంగిపొర్లడంతో గ్రామం మొత్తం జలదిగ్భందంలో ఉండిపోయింది. రామాలయం పడమరమెట్లు, విస్టా కాంప్లెక్స్‌, అన్న‌దాన సత్రం వరకు వర్షపు నీరు వచ్చిచేరింది. వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ప‌లు గ్రామాల్లో అధికారులు ముంపు హెచ్చరికలు జారీ చేశారు. గ్రామస్థులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావ‌రి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రాజమండ్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రావులపాలెంలో మండలంలో కుండపోత వర్షం కురుస్తోంది. వర్షబీభత్సానికి విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అమలాపురంలో కొన్ని కాల‌నీలు జలమయమయ్యాయి. ఇక్క‌డ 11 సెంటీమీట‌ర్ల వ‌ర్షం న‌మోద‌య్యింది. తునిలో కొండవారిపేటలో తాండవ నది పొంగిపొర్లుతోంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో అనేక‌చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏజెన్సీలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఫిరంగిపురం మండలం మందులపాలెంలో గోడకూలి ఓ బాలుడు మృతి చెందాడు.
First Published:  20 Jun 2015 7:29 AM IST
Next Story