కృష్ణాజలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన సయోధ్య
తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రాకు 512 టీఎంసీల నీటి వాటా. నదీ జలాల వినియోగంపై ఉప్పూ నీప్పులా చిటపటలాడే తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాల వినియోగంపై మాత్రం సఖ్యత ప్రదర్శించాయి. కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య సయోధ్య ఏర్పడింది. ఈమేరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్ర్రప్రదేశ్ కు 512 టీఎంసీల వాటా దక్కింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారమే తెలుగు రాష్ట్రాలకు నీటి పంపకాలు జరిగాయి. ఈ నీటిని […]
తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రాకు 512 టీఎంసీల నీటి వాటా. నదీ జలాల వినియోగంపై ఉప్పూ నీప్పులా చిటపటలాడే తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాల వినియోగంపై మాత్రం సఖ్యత ప్రదర్శించాయి. కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య సయోధ్య ఏర్పడింది. ఈమేరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్ర్రప్రదేశ్ కు 512 టీఎంసీల వాటా దక్కింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారమే తెలుగు రాష్ట్రాలకు నీటి పంపకాలు జరిగాయి. ఈ నీటిని రెండు రాష్ట్రాలు ఎప్పుడైనా వాడుకోవచ్చు. అనుమతులున్న ప్రాజెక్టులతో పాటు అనుమతులు లేని ప్రాజెక్టులకు కూడా ఈ నీటిని వాడుకోవచ్చు. అయితే, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని నిర్ణయిస్తూ రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, కేంద్ర జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి సంతకాలు చేశారు.