Telugu Global
Cinema & Entertainment

 సూపర్ స్టార్ సినిమాలో ప్రకాశ్ రాజ్

సినిమా ఏ హీరోదైనప్పటికీ.. ఏ భాషలో తెరకెక్కుతున్నప్పటికీ ఆ ప్రాజెక్టులో ప్రకాష్ రాజ్ కామన్ అయిపోయాడు. ఏదైనా క్యారెక్టర్ ను పండించాలంటే ప్రకాష్ రాజ్ కావాలి. అలా ఇండియాలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అనిపించుకున్నాడు ప్రకాష్. కానీ ప్రకాష్ రాజ్ కు మాత్రం తీరని కోరిక ఒకటుంది. తనకు ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ.. ఇప్పటికే వందల చిత్రాల్లో నటించినప్పటికీ.. సూపర్ స్టార్ రజనీకాంత్ కు మాత్రం దూరంగానే ఉంటున్నాడు ప్రకాష్ రాజ్. రజనీ సినిమాల్లో నటించే అవకాశం […]

 సూపర్ స్టార్ సినిమాలో ప్రకాశ్ రాజ్
X
సినిమా ఏ హీరోదైనప్పటికీ.. ఏ భాషలో తెరకెక్కుతున్నప్పటికీ ఆ ప్రాజెక్టులో ప్రకాష్ రాజ్ కామన్ అయిపోయాడు. ఏదైనా క్యారెక్టర్ ను పండించాలంటే ప్రకాష్ రాజ్ కావాలి. అలా ఇండియాలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అనిపించుకున్నాడు ప్రకాష్. కానీ ప్రకాష్ రాజ్ కు మాత్రం తీరని కోరిక ఒకటుంది. తనకు ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ.. ఇప్పటికే వందల చిత్రాల్లో నటించినప్పటికీ.. సూపర్ స్టార్ రజనీకాంత్ కు మాత్రం దూరంగానే ఉంటున్నాడు ప్రకాష్ రాజ్. రజనీ సినిమాల్లో నటించే అవకాశం మాత్రం ఇతడ్ని వరించడం లేదు. ఎట్టకేలకు ఆ ఛాన్స్ దక్కించుకున్నాడు ప్రకాష్ రాజ్. త్వరలోనే రజనీ చేయబోతున్న 159వ సినిమాలో ఓ కీలకపాత్రకు ఎంపికయ్యాడు ప్రకాష్ రాజ్. రంజిత్ డైరక్షన్ లో రజనీకాంత్ చేయబోతున్న సినిమాలో రజనీకాంత్ తర్వాత ఫైనలైజ్ చేసిన పేరు ప్రకాష్ రాజ్ దే. అంత కీలకమైన పాత్ర అది. అప్పుడెప్పుడో రజనీకాంత్ చేసిన నరసింహ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేశాడు ప్రకాష్ రాజ్. అంతే.. ఆ తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. ఇన్నాళ్లకూ తన సినిమాలో ఓ మంచి పాత్రను ప్రకాష్ రాజ్ కు ఆఫర్ చేశాడు రజనీకాంత్.
First Published:  20 Jun 2015 9:17 AM IST
Next Story