పోస్టు ద్వారా సాక్షి టీవీకి నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టీ-న్యూస్‌తోపాటు సాక్షి టీవీకి కూడా నోటీసులు ఇచ్చామని విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ త్రివిక్రమ్ వర్మ చెప్పారు. ‘‘కేబుల్ నెట్‌వర్క్ నియంత్రణ చట్టం-1995లోని సెక్షన్ 19 ప్రకారం నోటీసు జారీ చేస్తున్నాం. మీ చానల్ ప్రోగ్రామ్ కోడ్‌ను ఉల్లంఘించింది. పరువు నష్టం కలిగించేలా తప్పుడు, అర్ధసత్యాలతో కూడిన కథనాలను ప్రసారం చేసింది. ఈనెల 7వ తేదీ రాత్రి మీ చానల్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రసారమైన కార్యక్రమానికి సంబంధించి చట్టబద్ధమైన చర్యలు ఎందుకు […]
BY sarvi20 Jun 2015 12:21 PM IST
X
sarvi Updated On: 20 Jun 2015 12:28 PM IST
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టీ-న్యూస్‌తోపాటు సాక్షి టీవీకి కూడా నోటీసులు ఇచ్చామని విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ త్రివిక్రమ్ వర్మ చెప్పారు. ‘‘కేబుల్ నెట్‌వర్క్ నియంత్రణ చట్టం-1995లోని సెక్షన్ 19 ప్రకారం నోటీసు జారీ చేస్తున్నాం. మీ చానల్ ప్రోగ్రామ్ కోడ్‌ను ఉల్లంఘించింది. పరువు నష్టం కలిగించేలా తప్పుడు, అర్ధసత్యాలతో కూడిన కథనాలను ప్రసారం చేసింది. ఈనెల 7వ తేదీ రాత్రి మీ చానల్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రసారమైన కార్యక్రమానికి సంబంధించి చట్టబద్ధమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వగలరు’’ అని నోటీసుల్లో ఆదేశించినట్టు ఆయన తెలిపారు.
Next Story