Telugu Global
Others

జూలై 1 నుంచి 108 కోర్సులకు అడ్మిషన్లు

సెంట్ర‌ల్‌ వర్సిటీ సౌత్ క్యాంపస్‌లోని కాలేజ్‌ ఫర్‌ ఇంటిగ్రెటే డ్‌ స్టడీస్‌లో 1 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి ఇంటిగ్రెటేడ్‌ కోర్సుల నుంచి పీహెచ్‌డీ వరకు అడ్మిషన్లు నిర్వహిస్తామని వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఫ్రొఫెసర్‌ వి.కృష్ణ చెప్పారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి జూలై 1నుంచి 10వ తేదీ వరకు 108 కోర్సులకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. జూలై 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, మెరిట్‌ జాబితాలోని […]

సెంట్ర‌ల్‌ వర్సిటీ సౌత్ క్యాంపస్‌లోని కాలేజ్‌ ఫర్‌ ఇంటిగ్రెటే డ్‌ స్టడీస్‌లో 1 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి ఇంటిగ్రెటేడ్‌ కోర్సుల నుంచి పీహెచ్‌డీ వరకు అడ్మిషన్లు నిర్వహిస్తామని వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఫ్రొఫెసర్‌ వి.కృష్ణ చెప్పారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి జూలై 1నుంచి 10వ తేదీ వరకు 108 కోర్సులకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. జూలై 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, మెరిట్‌ జాబితాలోని విద్యార్థులు జూన్‌ 25వ తేదీలోపు ఆ న్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చని సూచించారు. ఎంటెక్‌ మెటిరియల్‌ ఇంజనీరింగ్‌ సైన్స్‌, ఎంటెక్‌ మినరల్‌ ఎక్స్‌ప్లొరేషన్‌, ఎంటెక్‌ బయోఇన్ఫర్‌మేటేక్స్‌, ఎంబీఏ హెల్త్‌కెర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ప్రస్తుతం గుర్తింపు లభించలేదన్నారు. అయితే ఏఐసీటీయూ గుర్తింపులేని ఈ నాలుగు కోర్సులకు గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తుమన్నారు.
First Published:  19 Jun 2015 6:36 PM IST
Next Story