ఏపీ చర్యలపై కేంద్రం విస్మయం ?
ఓటుకు నోటు ఎర కేసు తదనంతరం చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కేంద్రానికి కూడా విస్మయం కలిగిస్తున్నాయట. ఓటుకు కోట్లు వివాదంపై కేంద్రానికి ఫిర్యాదులు, గవర్నర్‌పై మాటల దాడి చేసిన చంద్రబాబుకి ఎటువంటి ఫలితాలివ్వలేదు. తాజాగా ఓటుకు నోటు ఎర కేసులో పరారీలో ఉన్న మత్తయ్య తరఫున వాదించడానికి ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు కోర్టుకు హాజరవ్వడం న్యాయవాదులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక రాష్ర్ట పోలీసులు వెదుకుతున్న నిందితుడికి ఏపీ పోలీసులు అండగా నిలవడంపైనే తీవ్ర […]
ఓటుకు నోటు ఎర కేసు తదనంతరం చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కేంద్రానికి కూడా విస్మయం కలిగిస్తున్నాయట. ఓటుకు కోట్లు వివాదంపై కేంద్రానికి ఫిర్యాదులు, గవర్నర్‌పై మాటల దాడి చేసిన చంద్రబాబుకి ఎటువంటి ఫలితాలివ్వలేదు. తాజాగా ఓటుకు నోటు ఎర కేసులో పరారీలో ఉన్న మత్తయ్య తరఫున వాదించడానికి ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు కోర్టుకు హాజరవ్వడం న్యాయవాదులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక రాష్ర్ట పోలీసులు వెదుకుతున్న నిందితుడికి ఏపీ పోలీసులు అండగా నిలవడంపైనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అది చాలదు అన్నట్లుగా .. ఆ రాష్ర్ట ప్రభుత్వ ప్లీడరు మత్తయ్య కేసును వాదించడానికి రావడం ఆ ప్రభుత్వానికి ఈ కేసుపై ఉన్న ఆసక్తిని తెలియజేస్తున్నాయి. ఇంకో విషయమేమిటంటే మత్తయ్య తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూత్రా హాజరవుతున్నారు. లూత్రా వంటి సీనియర్ న్యాయవాదిని ఫీజుల పరంగా భరించేంత శక్తి మత్తయ్యకు ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మత్తయ్య విషయంలో మొదటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడలేని ప్రేమ కురిపిస్తోంది. ఏపీ పోలీసులు, న్యాయవాదులు, రాజకీయ నేతలు, ఏపీ ప్రభుత్వం ఇలా అన్ని వ్యవస్థలు ఒక నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తుండటం జాతీయవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది.
కాల్‌డేటా కోసం ఒత్తిళ్లు!
ఎలాగైనా సరే! కేసీఆర్ ను గద్దె దించుతామని చెబుతున్న చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లే ఉంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో పాటు ఏసీబీ డీజీ ఏకే ఖాన్, నిఘా విభాగం అధిపతి శివధర్‌రెడ్డిల కాల్‌డేటా ఇవ్వాలంటూ ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు మొబైల్ ఆపరేటర్లపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారన్న వార్తలు మరో కలకలానికి దారి తీశాయి. మొబైల్ ఆపరేటర్లు తమపై వస్తున్న ఒత్తిడి విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ అధికారులకు తెలియజేసారు.
సండ్ర అదృశ్యం వెనక…?
ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే అదృశ్యం వెనక ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. విచారణకు రాలేనని సండ్ర పేరిట సాయంత్రంపూట లేఖ విడుదలైంది. అందులో ఎక్కడా తానుంటున్న చిరునామా, ఫోన్‌నెం వెల్లడించలేదు. బాబు ఒత్తిడి మేరకే ఇదంతా జరిగిందని టీఆర్ ఎస్, వైస్సార్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఏసిబి విచారణను ఎలా ఎదుర్కోవాలో సండ్రకు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం.
మీడియాకు నోటీసులు..
తెలంగాణలో ఏబీఎన్-చానల్ నిషేధానికి గురైనపుడు ఆ అంశాన్ని టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించారు. మీడియాకు సంకెళ్లు వేయడం తగదని ఆందోళనలు చేశారు. ఓటుకు నోటు కేసులో వాస్తవాలు వెల్లడిస్తున్న ఎన్-టీవీని ఏపీలో ప్రసారం కాకుండా నిలిపివేయడంపై టీడీపీ నేతలు నోరు మెదపడం లేదు. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి టీ-న్యూస్ చానల్‌కి వెళ్లి నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. ఇదంతా ఓటుకు నోటు ఎర కేసులో చంద్రబాబు లోకం దృష్టి మరల్చేందుకు వేసిన తాజా ఎత్తుగడని తెలంగాణ జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి.