రేపు నెక్లెస్ రోడ్‌లో 5కె రన్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్, తిరిగి పీపుల్స్ ప్లాజా వరకు 5కే వాక్ నిర్వహిస్తున్నామని శ్రీమాతాజీ నిర్మలాదేవి సహజ యోగా ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బ్రహ్మచారి తెలిపారు. ఈ రన్‌లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారన్నారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో యోగా పరిచయ కార్యక్రమం, యోగా వల్ల కలిగే ప్రయోజనాలు, […]
BY Pragnadhar Reddy19 Jun 2015 6:34 PM IST
Pragnadhar Reddy Updated On: 20 Jun 2015 2:28 AM IST
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్, తిరిగి పీపుల్స్ ప్లాజా వరకు 5కే వాక్ నిర్వహిస్తున్నామని శ్రీమాతాజీ నిర్మలాదేవి సహజ యోగా ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బ్రహ్మచారి తెలిపారు. ఈ రన్‌లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారన్నారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో యోగా పరిచయ కార్యక్రమం, యోగా వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రాముఖ్యత వివరించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కార్పొరేట్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా యోగా కార్యక్రమాన్ని ఆదివారమే నిర్వహిస్తున్నామని తెలిపారు.
Next Story