Telugu Global
Others

22-26 మధ్య అమెరికా వీసా ఇంటర్వ్యూలు రద్దు

అమెరికా వీసాల జారీ ప్ర‌క్రియ‌ను తాత్కాలికంగా నిలిపి వేశారు. వీసాల జారీ చేసే విభాగం కంప్యూటర్లలో సాంకేతిక సమస్య తలెత్త‌డంతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసాల జారీ ప్రక్రియకు అవరోధం ఏర్పడింది. బ్యూరో ఆఫ్‌ కాన్సులర్‌ అఫైర్స్‌లో సాంకేతిక సమస్య తలెత్తింద‌ని, దీనివ‌ల్ల వీసాల జారీలో ఇబ్బందులు ఏర్పడ్డాయ‌ని, దీన్ని పరిష్కరించేందుకు నిపుణులు 24 గంటలూ శ్రమిస్తున్నార‌ని, అతి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామ‌ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బే వెల్లడించారు. హార్డ్‌వేర్‌ వైఫల్యంతో తలెత్తిన ఈ […]

అమెరికా వీసాల జారీ ప్ర‌క్రియ‌ను తాత్కాలికంగా నిలిపి వేశారు. వీసాల జారీ చేసే విభాగం కంప్యూటర్లలో సాంకేతిక సమస్య తలెత్త‌డంతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసాల జారీ ప్రక్రియకు అవరోధం ఏర్పడింది. బ్యూరో ఆఫ్‌ కాన్సులర్‌ అఫైర్స్‌లో సాంకేతిక సమస్య తలెత్తింద‌ని, దీనివ‌ల్ల వీసాల జారీలో ఇబ్బందులు ఏర్పడ్డాయ‌ని, దీన్ని పరిష్కరించేందుకు నిపుణులు 24 గంటలూ శ్రమిస్తున్నార‌ని, అతి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామ‌ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బే వెల్లడించారు. హార్డ్‌వేర్‌ వైఫల్యంతో తలెత్తిన ఈ సమస్యను పరిష్కరించేందుకు 100 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలోని కంప్యూటర్‌ నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన వివరించారు. అమెరికా వీసాల కోసం ఎదురు చూస్తున్న వారికి కలిగిన ఇబ్బందికి విచారం వ్యక్తం చేస్తున్నామని కిర్బే పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని, రానున్న వారంలో సేవలు పునరుద్ధరించడం అనుమానమేనని కిర్బే పేర్కొన్నారు. అందుకే ఈనెల 22 నుంచి 26 వ‌ర‌కు వీసాల జారీ ర‌ద్దు చేశామ‌ని తెలిపారు.
First Published:  18 Jun 2015 6:37 PM IST
Next Story