పది మంది ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
ఆంధ్ర్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. అనూహ్య రీతిలో ఎన్నికల బరిలోంచి స్వతంత్ర అభ్యర్థులు తప్పుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఓ కొలిక్కి వచ్చాయి. రెండు జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు జిల్లాల్లో పది ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా నుంచి గాలి ముద్దు కృష్ణమ నాయుడు, తూర్పు గోదావరి జిల్లా నుంచి రెడ్డి సుబ్రమణ్యం, కృష్ణా జిల్లా నుంచి […]
ఆంధ్ర్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. అనూహ్య రీతిలో ఎన్నికల బరిలోంచి స్వతంత్ర అభ్యర్థులు తప్పుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఓ కొలిక్కి వచ్చాయి. రెండు జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు జిల్లాల్లో పది ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా నుంచి గాలి ముద్దు కృష్ణమ నాయుడు, తూర్పు గోదావరి జిల్లా నుంచి రెడ్డి సుబ్రమణ్యం, కృష్ణా జిల్లా నుంచి బుద్దా వెంకన్న, బాబూ రాజేంద్రప్రసాద్, విశాఖపట్నం జిల్లా నుంచి ఎంవీవీఎస్ మూర్తి, పప్పుల చలపతిరావు, అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, విజయనగరం జిల్లా నుంచి ద్వారపురెడ్డి జగదీష్, గుంటూరు జిల్లా నుంచి అన్నం సతీష్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో ఉమ్మారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా మిగిలిన తొమ్మిది మందీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు. అయితే ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో మాత్రం ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నలుగురు అభ్యర్థులు నిలిచారు. వైసీపీ అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి, టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డితో పాటుగా మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వైసీపీ నుంచి అట్ల చినవెంకట్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ కారణంగా ఎన్నికలు అనివార్యం అయ్యేట్టు కనిపిస్తున్నాయి.