ప్రశ్నించే వాడు ఏమయ్యాడు? : రాంగోపాల్ వర్మ ట్వీట్
ప్రస్తుతం ఒకప్పటి క్రియేటివ్ జీనీయస్ రామ్ గోపాల్ వర్మ తన ఉనికిని మీడియాలో ఉంచడానికి సెలిబ్రిటీల్ని టార్గెట్ చేస్తూ..సందర్భోచితంగా వ్యంగ్య బాణాలు వదులుతుంటాడు. లేటెస్ట్ గా రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశాడు. ప్రశ్నిస్తానన్నవాడు ప్రశ్నించకపోతే ప్రజలకు ద్రోహం చేసినట్టే కదా… ఈ మాటలన్నది ఎవరో కాదు సినీ దర్శకుడు రాంగోపాల వర్మ. రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఓటుకు నోటు వ్యవహారంపై ఆ నాయకుడు ఇంతవరకు నోరు ఎందుకు […]
BY admin19 Jun 2015 6:06 AM IST
X
admin Updated On: 19 Jun 2015 6:33 AM IST
ప్రస్తుతం ఒకప్పటి క్రియేటివ్ జీనీయస్ రామ్ గోపాల్ వర్మ తన ఉనికిని మీడియాలో ఉంచడానికి సెలిబ్రిటీల్ని టార్గెట్ చేస్తూ..సందర్భోచితంగా వ్యంగ్య బాణాలు వదులుతుంటాడు. లేటెస్ట్ గా రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశాడు. ప్రశ్నిస్తానన్నవాడు ప్రశ్నించకపోతే ప్రజలకు ద్రోహం చేసినట్టే కదా… ఈ మాటలన్నది ఎవరో కాదు సినీ దర్శకుడు రాంగోపాల వర్మ. రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఓటుకు నోటు వ్యవహారంపై ఆ నాయకుడు ఇంతవరకు నోరు ఎందుకు విప్పలేదని ఆయన ప్రశ్నించారు. ‘ప్రశ్నిస్తానన్న వాడు ప్రశ్నించనప్పుడు లోక కల్యాణానికి ద్రోహం… ఇది కల్యాణ ద్రోహం. పాలకుల్ని ప్రశ్నిస్తాననే వాడు ప్రశ్నించనప్పుడు, కల్యాణం కోరుకునే జనాలకి ప్పెళ్ళెప్పుడు? ‘ అని రాంగోపాల్ వర్మ వ్యంగ్యంగా తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా ఆయనపై సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేశారు. ఓటుకు నోటు వ్యవహారంపై ఇంతకుముందే వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘చంద్రబాబు అనుసరించిన తీరుతో ఆంధ్రుడినని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నా’ నని వర్మ ట్వీట్ చేశారు. చంద్రబాబు చర్య వల్ల రాష్ట్ర ప్రజలు జాతీయస్థాయిలో తలవంపులకు గురికావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇపుడు పరోక్షంగా పవన్ కల్యాణ్‌ని నిలదీశారు.
Next Story