కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ మూవీ రివ్యూ
కృష్ణమ్మ ముంచింది ప్రేక్షకుల్ని అన్నీ వేగంగా మారిపోతున్న కాలంలో సినిమా స్లోగా ఉంటే ఏమవుతుంది? కృష్ణమ్మ కలిపింది ఇద్దర్ని అవుతుంది. కథ చాలాపాతది. పోనీ వేరేషన్ కొత్తగా ఉందా అంటే అదీ లేదు. 1980 నాటి సినిమాచూసిన ఫీలింగ్. ఇప్పటికి ప్రేక్షకులు వందసార్లకు పైగా చూసేసిన ఇలాంటి కథని కన్నడం నుంచి కొనుక్కున్నారు. సినిమా నిర్మాణంలో కన్నడిగులు మన కంటే కనీసం పదేళ్ళు వెనుకబడి ఉన్నారు. తమిళులు పదేళ్ళు ముందున్నారు. తమిళ కథయినా, కన్నడ కథయినా చెడగొట్టి […]
కృష్ణమ్మ ముంచింది ప్రేక్షకుల్ని
అన్నీ వేగంగా మారిపోతున్న కాలంలో సినిమా స్లోగా ఉంటే ఏమవుతుంది? కృష్ణమ్మ కలిపింది ఇద్దర్ని అవుతుంది. కథ చాలాపాతది. పోనీ వేరేషన్ కొత్తగా ఉందా అంటే అదీ లేదు. 1980 నాటి సినిమాచూసిన ఫీలింగ్. ఇప్పటికి ప్రేక్షకులు వందసార్లకు పైగా చూసేసిన ఇలాంటి కథని కన్నడం నుంచి కొనుక్కున్నారు. సినిమా నిర్మాణంలో కన్నడిగులు మన కంటే కనీసం పదేళ్ళు వెనుకబడి ఉన్నారు. తమిళులు పదేళ్ళు ముందున్నారు. తమిళ కథయినా, కన్నడ కథయినా చెడగొట్టి చెండాడడంలో తెలుగువాళ్ళు పరిణితి సాధించారు.
ఈ కథ ఏమంటే కృష్ణ పేదింటి కుర్రాడు, చిన్నప్పుడు సరిగా చదవడు. క్లాస్‌లోకి రాధ ప్రవేశించగానే అతనికి ఒక ప్రేరణ కలుగుతుంది. బాగా చదువుతాడు. తన ప్రేమని ఎప్పటికప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కాని చెప్పలేడు. ఒకసారి ప్రేమలేఖ రాస్తాడు. అది ప్రిన్సిపాల్‌కి అందుతుంది. ప్రేమమంచిది కాదని, కేరీరే ముఖ్యమని ఆయన చెబుతాడు. ప్రేమ గురించి చెప్పలేక అమెరికా వెళ్ళిపోతాడు.
పూర్వ విద్యార్థుల సమ్మేళనంకోసం ఇండియాకి తిరిగివస్తాడు. ఆ జ్ఞాపకాలే ఈ సినిమా. రెండు గంటలపాటు అనేక పాటలు పాడి, ఫైటింగ్‌లు చేసిన హీరో చివరికి హీరోయిన్‌ని కలుసుకుంటాడా లేదా? ఓపికుంటే తెలుసుకోండి.
సినిమాలో ఏ ఒక్క సీన్ కొత్తగా అనిపించదు. హీరో సుధీర్ చాలా ఎనర్జిటిక్‌గా నటించాడు. కథ బలహీనమైపోవడంతో అతని శక్తి వృధా అయ్యింది. హీరోయిన్ నందిని కృష్ణా కృష్ణా అని అరవడం తప్ప నటించడానికేమీలేదు. పాటలు, ఫోటోగ్రఫి బావున్నాయి. ఖదీర్‌బాబు చక్కటి డైలాగులు రాసాడు. కానీ ఇవేమీ సినిమాని నిలబెట్టవు.
సెల్‌ఫోన్లలో ఐదు నిముషాల పరిచయంతోనే ఐలవ్‌యూ చెప్పుకునే కాలంలో ఏళ్ళ తరబడి ప్రేమ చెప్పుకోలేక తపనపడే హీరోని చూడడం కష్టం. ప్రేమ సన్నివేశాలు సెన్సిటివ్‌గా చూపించడానికి దర్శకుడు ప్రయత్నించినా అవి ఎందుకో కనెక్ట్‌కాలేదు. అయితే ఆఖరి సన్నివేశాలలో కళ్ళు చెమరుస్తాయి. ఇదొక్కటే ప్లస్‌పాయింట్.
ప్రేమకథల్ని అందరూ చూడడానికే ఇష్టపడతారుకానీ అదికేవలం తెరమీది పాత్రల సమస్యగా మారితే కష్టం. మన సంఘర్షణగా కూడా మారితేనే చూస్తాం.
– శ్రీకాంత్
రేటింగ్: 2/5