Telugu Global
NEWS

గ‌వ‌ర్న‌ర్‌ను దూషించి.. దిద్దుబాటు చ‌ర్య‌ల్లో ఏపీ స‌ర్కారు!

‘మాకు ఎదురే  లేదు.. మ‌మ్మ‌ల్నెవ‌డూ ఆప‌లేడు’.. అన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న ఏపీ మంత్రుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. గ‌వ‌ర్న‌ర్‌ను ఉద్దేశించి ఏపీ మంత్రులుచేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లోఉన్న ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావును పిలిచి తాజా పరిణామాలపై కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో పాటు తాజాగా గవర్నర్‌పై ఏపీ మంత్రులు, అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల మొత్తం వివరాలను కేంద్ర హోం […]

గ‌వ‌ర్న‌ర్‌ను దూషించి.. దిద్దుబాటు చ‌ర్య‌ల్లో ఏపీ స‌ర్కారు!
X
‘మాకు ఎదురే లేదు.. మ‌మ్మ‌ల్నెవ‌డూ ఆప‌లేడు’.. అన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న ఏపీ మంత్రుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. గ‌వ‌ర్న‌ర్‌ను ఉద్దేశించి ఏపీ మంత్రులుచేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లోఉన్న ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావును పిలిచి తాజా పరిణామాలపై కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో పాటు తాజాగా గవర్నర్‌పై ఏపీ మంత్రులు, అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల మొత్తం వివరాలను కేంద్ర హోం శాఖ తెప్పించుకుని పరిశీలించింది.ఆ శాఖ కార్యదర్శి ఎల్‌సీ గోయల్ రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో ఫోన్‌లో మాట్లాడి జరుగుతున్న పరిణామాలేంటో అడిగి తెలుసుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలేవైనా ఉంటే సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే ఏపీ మంత్రులు, ఆ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్న తీరును గవర్నర్ వివరించినట్టు తెలిసింది.
కేంద్రం ఆగ్ర‌హంతో కంటి తుడుపు చ‌ర్య‌లు!
త‌న‌పై ప‌డ్డ నింద‌ను రెండు రాష్ర్టాల మ‌ధ్య వివాదంగా మ‌లచ‌డంలో ఏపీ సీం చంద్ర‌బాబు విఫ‌ల‌మ‌య్యారు. చేసేది లేక గ‌వ‌ర్న‌ర్ ల‌క్ష్యంగా త‌న మంత్రుల చేత తిట్టించారు. మంత్రి అచ్చెన్నాయుడు ఈ విష‌యంలో అధినేత ఆశీస్సులు అందుకోవ‌డానికి గ‌వ‌ర్న‌ర్‌ను గంగిరెద్దుతో పోలుస్తూ వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగారు. ఆయ‌న వ్యాఖ్య‌లు తెలుగుదేశం మాన‌సిక ప‌రిస్థితికి, గ‌వ‌ర్న‌ర్‌పై ఉన్న అక్క‌సుకు అద్దం ప‌డుతున్నాయి. తాను చెడ్డ కోతి వ‌న‌మంతా చెరిచింద‌ని.. త‌మ‌పై ప‌డ్డ నింద నుంచి లోకం దృష్టి మ‌ర‌ల్చేందుకు రాజ్యాంగ ప్ర‌తినిధి అయిన గ‌వ‌ర్న‌ర్‌ను, తెలంగాణ ప్ర‌భుత్వం, అధికారులు, ద‌ర్యాప్తు సంస్థ‌లను తిడుతూ మేము రాజ్యాంగానికి అతీతం అన్న రీతిలో పొరుగుబోతు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ విష‌యంలో కేంద్రం సీరియ‌స్ అవ‌డంతో ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లోఉన్న ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ విష‌యాన్ని ఏపీ సీఎం చంద్ర‌బాబు చెవిన వేశారు. దీంతో ఈ పాచికా… పారేలా లేద‌ని చంద్ర‌బాబుకు అర్థ‌మైంది. గ‌త్యంత‌రం లేక మంత్రుల‌కు ఫోన్లు చేసి ఆ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ఆదేశించారు. వీరికి రాజ్యాంగం క‌న్నా.. దాన్ని అవ‌మానించేలా కార్య‌క‌లాపాల‌కు దిగుతున్న చంద్ర‌బాబు మాటే వేదం కాబ‌ట్టి ఆ మేర‌కు ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లుజారీ చేశారు. గ‌వ‌ర్న‌ర్ మ‌న‌సు నొప్పించి ఉంటే… త‌మ వ్యాఖ్య‌ల‌ను వెనక్కి తీసుకుంటున్నామని ప్ర‌క‌టించారు . అంతేకానీ తాము చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల ప‌శ్చాతాపం వ్య‌క్తం చేయ‌లేదు. క‌నీసం క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోవ‌డం వారి రాజ‌కీయ విజ్ఞతకు నిద‌ర్శ‌నంలా నిలిచింది.
First Published:  19 Jun 2015 5:03 AM IST
Next Story