Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 117

“హలో! బారు ఎన్ని గంటలకు ఓపెన్‌ చేస్తారు?” “పొద్దున్న పది గంటలకు” మళ్ళీ అరగంట తరువాత ఫోను “హలో! బారు ఎన్ని గంటలకు ఓపెన్‌ చేస్తారు?” “పదిగంటలకు?” ఇట్లా నాలుగైదు సార్లు ఫోను వచ్చింది. “అరే! ఎన్నిసార్లు చేస్తారండి. పొద్దున్నే పదిగంటలకు తెరుస్తారని చెప్పాం కదా!” “బాబూ! నేను బారులో ఉన్నాను. బయటకి రావాలి. అందుకని”. ——————————————————— “నేను పెళ్ళి చేసుకున్నాక మా ఆయన లక్షాధికారి అయ్యాడు” “అంతకుముందు?” “కోటీశ్వరుడు” ——————————————————— రాత్రిపూట బీరువాతీసి నక్లెస్‌ తీసుకుపోతున్న […]

“హలో! బారు ఎన్ని గంటలకు ఓపెన్‌ చేస్తారు?”
“పొద్దున్న పది గంటలకు”
మళ్ళీ అరగంట తరువాత ఫోను
“హలో! బారు ఎన్ని గంటలకు ఓపెన్‌ చేస్తారు?”
“పదిగంటలకు?”
ఇట్లా నాలుగైదు సార్లు ఫోను వచ్చింది.
“అరే! ఎన్నిసార్లు చేస్తారండి. పొద్దున్నే పదిగంటలకు తెరుస్తారని చెప్పాం కదా!”
“బాబూ! నేను బారులో ఉన్నాను. బయటకి రావాలి. అందుకని”.
———————————————————
“నేను పెళ్ళి చేసుకున్నాక మా ఆయన లక్షాధికారి అయ్యాడు”
“అంతకుముందు?”
“కోటీశ్వరుడు”
———————————————————
రాత్రిపూట బీరువాతీసి నక్లెస్‌ తీసుకుపోతున్న దొంగని చూపించి “వెళ్ళి వాణ్ణి పట్టుకోండి” అంది భార్య.
భర్త “వాడి దగ్గర కత్తి ఉందేమోనే” అన్నాడు.
భార్య “ఐతే ఏమిటి? మీకు ఇన్సూరెన్స్‌ ఉంది. నెక్లెస్‌కు లేదు” అంది.
———————————————————
“మీరింత గొప్పగా ఎలా ఉపన్యాసమిస్తారు?”
ఎవరో విన్‌స్టన్‌ చర్చిల్‌ని అడిగారు
చర్చిల్‌ నవ్వుతూ “నేను మాట్లాడబోయేముందు సభనంతా ఒకసారి చూస్తాను.
అక్కడ కూర్చున్న జనాల్ని చూస్తాను. ఎంతమంది బుర్రలేని వాళ్ళున్నారు అనుకుంటాను. అప్పుడు మొదలుపెడతాను”.
———————————————————

First Published:  17 Jun 2015 6:33 PM IST
Next Story