Telugu Global
Health & Life Style

గుంటూరులో చర్మ బ్యాంక్‌! ఏర్పాటు

బ్లడ్‌ బ్యాంకు గురించి విని ఉంటారు. ఐ బ్యాంక్‌ గురించి కూడా విని ఉంటారు. కానీ.. చర్మ నిధి (హ్యూమన్‌ స్కిన్‌ బ్యాంక్‌) గురించి చాలా తక్కువ మందికి తెలుసు. పాశ్యాత్య దేశాల్లో ఉండే ఈ తరహా స్కిన్‌ బ్యాంక్‌ ఇప్పుడు ఏపీలోని గుంటూరు ప్రభుత్వ వైద్య బోధనాస్పత్రిలో ఏర్పాటు కానుంది. అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (జింకానా) జీజీహెచ్‌లో దీన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మన పొరుగు రాష్ట్రమైన […]

బ్లడ్‌ బ్యాంకు గురించి విని ఉంటారు. ఐ బ్యాంక్‌ గురించి కూడా విని ఉంటారు. కానీ.. చర్మ నిధి (హ్యూమన్‌ స్కిన్‌ బ్యాంక్‌) గురించి చాలా తక్కువ మందికి తెలుసు. పాశ్యాత్య దేశాల్లో ఉండే ఈ తరహా స్కిన్‌ బ్యాంక్‌ ఇప్పుడు ఏపీలోని గుంటూరు ప్రభుత్వ వైద్య బోధనాస్పత్రిలో ఏర్పాటు కానుంది. అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (జింకానా) జీజీహెచ్‌లో దీన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కూడా స్కిన్‌ బ్యాంక్‌ అందుబాటులో ఉందిగానీ.. ఏపీ, తెలంగాణల్లో ఇప్పటి వరకూ చర్మ నిధి కేంద్రాలు ఎక్కడా లేవు. గుంటూరు జీజీహెచ్‌లో ఏర్పాటైతే తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలి హ్యుమన్‌ స్కిన్‌ బ్యాంక్‌ అవుతుంది. గుంటూరు వైద్య కళాశాలలో చదివి అమెరికాలో స్ధిరపడిన ఎన్నారై డాక్టర్‌ హనుమాన్‌ దాస్‌ మారెళ్ల.. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఈ స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు సాంకేతిక సహకారం అందిస్తున్నారు. ఈ స్కిన్‌ బ్యాంక్‌ సేకరించే చర్మాన్ని.. కాలిన గాయాల బాధితులకు గ్రాఫ్టింగ్‌ చేస్తారు. ఫలితంగా రోగి త్వరగా కోలుకోవడంతో పాటు కాలిన గాయాల ఆనవాళ్లు కూడా అంతగా కనిపించవు. స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటుతో పాటు.. దీనికి సమాంతరంగా 12 పడకలతో కూడిన బర్న్స్‌ ఐసీయూ వార్డునూ ఏర్పాటు చేయనున్నారు.
First Published:  17 Jun 2015 6:35 PM IST
Next Story