మాజీ ప్రియుడు పిలిస్తే వెళ్తా..!
ప్రేమ కథలు..విరహ వ్యధలు మరుపురాని కథలు అంటారు పెద్దలు. ఇండస్ట్రీలో ప్రేమ జంటలకు ఫాలోయింగ్ ఎక్కువ. వాళ్లు చేసే సినిమాలకంటే..వాళ్ల లవ్ ఎఫైర్స్ కు సంబంధించిన విశేషాలంటే అభిమానులకు ఎంతగానో ఆసక్తి కలిగిస్తుంటాయి. కట్ చేస్తే..కెరీర్ ప్రారంభంలో కూపర్స్ డెవిల్ ..కరీనా కపూర్.. యువ హీరో షాహిద్ కపూర్ తో ప్రేమలో పడింది. అతని కెరీర్ బూస్టింగ్ కోసం కొందరి ప్రొడ్యూసర్స్ కూ కరీనా ఏకంగా రికమెండ్ చేసిందంటారు. అదే ప్రేమ బంధానికి ఉన్న […]
BY admin18 Jun 2015 11:47 AM IST
X
admin Updated On: 18 Jun 2015 11:52 AM IST
ప్రేమ కథలు..విరహ వ్యధలు మరుపురాని కథలు అంటారు పెద్దలు. ఇండస్ట్రీలో ప్రేమ జంటలకు ఫాలోయింగ్ ఎక్కువ. వాళ్లు చేసే సినిమాలకంటే..వాళ్ల లవ్ ఎఫైర్స్ కు సంబంధించిన విశేషాలంటే అభిమానులకు ఎంతగానో ఆసక్తి కలిగిస్తుంటాయి. కట్ చేస్తే..కెరీర్ ప్రారంభంలో కూపర్స్ డెవిల్ ..కరీనా కపూర్.. యువ హీరో షాహిద్ కపూర్ తో ప్రేమలో పడింది. అతని కెరీర్ బూస్టింగ్ కోసం కొందరి ప్రొడ్యూసర్స్ కూ కరీనా ఏకంగా రికమెండ్ చేసిందంటారు. అదే ప్రేమ బంధానికి ఉన్న బలం .కానీ ఈ హాట్ బ్యూటీ రెండుచిత్రాలు సైఫ్ అలీ ఖాన్ తో నటించే సరికి..ఆయన ప్రేమకు ఫిదా అయ్యింది. కట్ చేస్తే ఖాన్ తో పర్మినెంట్ గా పిక్స్ అయ్యింది. ఈ మధ్య పెళ్లి కూడా చేసుకుంది.
కరీనాకపూర్ తో బ్రేకప్ అయిన తరువాత.. షాహిద్ కపూర్ కొంత కాలం ప్రియాంక చోప్రా తో క్లోజ్ గా వున్నాడు. అయితే ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. కెరీర్ పరంగా బండి యావరేజ్ గా నడిపిస్తున్నాడు. అయితే త్వరలో షాహిద్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. అంతే కాదు తన మాజీ ప్రేయసి కరీనాకపూర్ తో కలసి 'ఉడ్తా పంజాబ్' అనేచిత్రంలో నటిస్తున్నాడు. బ్రేకప్ తరువాత వీరిద్దరు కలసి చేస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హాం.ఇక షాహిద్ పెళ్లి గురించి కరీనా కపూర్ ను అడిగితే..అతను పిలవాలే గానీ.. తను కుటుంబంతో సహా అటెండ్ అవుతానని తెలిపింది. ముందు ముందు అతనితో కలసి సినిమాలు చేయడం కూడా తనకు ఇష్టమేనని తెలిపింది. సినిమా ప్రొఫెషన్ ను .. వ్యక్తి గత విషయాలతో చూడానవసరం లేదని తేల్చింది. బాలీవుడ్ లో ఈ మధ్య మాజి లవర్స్ కలసి నటించడం సర్వ సాధారణం అయిన విషయం తెలిసిందే.
Next Story