దొంగనోట్ల ఉచ్చులో బాబు అండ్ కో ?
ఓటుకు నోటు కేసులో ఉక్కిరి బిక్కిరవుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నాయకులకు ఇపుడు కొత్తగా దొంగనోట్ల కేసు కూడా జతయ్యింది. ఇదెక్కడి కేసురా అనుకుంటున్నారా..? నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్‌కు రేవంత్‌రెడ్డి ఇచ్చిన 50 లక్షల రూపాయలలో దొంగనోట్లు కూడా ఉన్నాయట. ఈ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు..? ఎవరు ఎవరికి ఇచ్చారు..? అది లెక్కల్లో ఉన్న డబ్బా లేక నల్ల ధనమా అని ఆదాయపు పన్ను శాఖ విచారిస్తోంది. […]
BY Pragnadhar Reddy18 Jun 2015 6:35 AM IST

X
Pragnadhar Reddy Updated On: 18 Jun 2015 3:58 PM IST
ఓటుకు నోటు కేసులో ఉక్కిరి బిక్కిరవుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నాయకులకు ఇపుడు కొత్తగా దొంగనోట్ల కేసు కూడా జతయ్యింది. ఇదెక్కడి కేసురా అనుకుంటున్నారా..? నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్‌కు రేవంత్‌రెడ్డి ఇచ్చిన 50 లక్షల రూపాయలలో దొంగనోట్లు కూడా ఉన్నాయట. ఈ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు..? ఎవరు ఎవరికి ఇచ్చారు..? అది లెక్కల్లో ఉన్న డబ్బా లేక నల్ల ధనమా అని ఆదాయపు పన్ను శాఖ విచారిస్తోంది. ఏసీబీ స్వాధీనం చేసుకున్న ఈ నోట్ల కట్టలను పరిశీలిస్తుండగా దొంగనోట్లు కూడా బయటపడ్డాయి. స్టీఫెన్‌సన్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఈ డబ్బును బ్యాంకు నుంచి విత్‌డ్రా చేశారా లేక ఎవరైనా పారిశ్రామిక వేత్త నుంచి తీసుకువచ్చారా అన్న దానిపై కూడా తెలంగాణ ఏసీబీ విచారణ జరుపుతున్న సంగతి తెల్సిందే. సాధారణంగా బ్యాంకు నుంచి ఈ డబ్బు మొత్తాన్నీ విత్ డ్రా చేసి ఉంటే దొంగనోట్లు వచ్చే అవకాశం ఉండదు. అందుచేత తప్పకుండా ఇవి బయట వ్యక్తుల నుంచి తెచ్చినవే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ దొంగనోట్లను చెలామణి చేస్తున్న దొంగలెవరో ఇపుడు తేలాల్సి ఉంది.
Next Story